హానీ గ్రూపు నుంచి మరిన్ని ప్రాజెక్టులు

More Real Estate Projects from Honeyy Group

ప్రముఖ రియల్‍ ఎస్టేట్‍ సంస్థల్లో ఒకటైన హనీ గ్రూపు డిమాండ్‍కు తగ్గట్టుగా మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రకటిఞచింది. ఇందులో భాగంగా వ్యాపారాన్ని కూడా శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే మూడు నెలల్లో పది నూతన ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు వచ్చే రెండేండ్లలో రూ.100 కోట్ల టర్నోవర్‍ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హనీ గ్రూపు సీఎండీ ఓబుల్‍ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సంస్థ టర్నోవర్‍ రూ.10 కోట్లుగా ఉన్నది. రియల్‍ ఎస్టేట్‍ రంగంలో అన్ని రకాల సేవలు అందించడానికి కన్సల్టింగ్‍ సేవలును సైతం అందిస్తున్న సంస్థ..ఈ విభాగంలో ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు ఉండగా, వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యను 2 వేలకు పెంచుకోనున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ, ఆంధప్రదేశ్‍, కర్ణాటకలో 16 శాఖలతో సేవలు కన్సల్టింగ్‍ సేవలు అందిస్తున్న సంస్థ.. వచ్చే మూడు నెలల్లో మరో ఏడు శాఖలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఆస్తుల కొనుగోలుకు సంబంధించి అన్ని రకాల సేవలు ఒక్కచోట అందించాలనే ఉద్దేశంతో రెండేండ్ల క్రితం ఈ గ్రూపును ప్రారంభిం చినట్లు, ఇది వరకు 21 ప్రాజెక్టులకు సంబంధించిన గృహాలను విక్రయించినట్లు చెప్పారు. హైదరాబాద్‍లో ప్రస్తుతం రియల్‍ ఎస్టేట్‍ రంగానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, దానికితోడు తెలంగాణలో ఇతర చోట్ల కూడా అనుకూల వాతావరణం ఉన్నందున ఇక్కడ రియల్‍ ప్రాజెక్టులకు డిమాండ్‍ ఉంటోందని కంపెని పేర్కొంటోంది.

www.honeyygroup.com

 

 


                    Advertise with us !!!