
రియల్ ఎస్టేట్‌రంగంలో తెలుగువాళ్ళు కూడా సత్తా చాటుతున్నారు. అన్నీవ్యాపారాల్లోనూ తెలుగువాళ్ళు కూడా ప్రముఖంగా ఉంటారని నిరూపించారు. కన్స్ట్రక్షన్ వ్యాపారంలోనూ తమకు సాటి లేదని హైదరాబాద్ రియల్ పారిశ్రామిక వేత్తలు మరోసారి నిరూపించుకున్నారు. రియాల్టి రంగం నేల చూపులు చూస్తున్న తరుణంలోనూ హైదరాబాదీలు నిర్మాణ రంగ సంస్థలు ముంబై,ఢిల్లి నగరాలతో పోటీపడుతూ, వినూత్న పోకడలతో.. కొనుగోలు దారులను ఆకట్టుకుంటూ తమదైన ముద్రను చాటుకుంటున్నారు. హురన్ రిపోర్ట్ అండ్ గ్రోహే ఇండియా సంస్థ 2019 సంవత్సరానికి గానూ ప్రకటించిన 100 మంది రియల్ ఎస్టేట్ సంపన్న పారిశ్రామిక వేత్తల్లో 8 మంది తెలుగు వారికి చోటు లభించింది. వీరిలో అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కు చెందిన సి. వెంకటేశ్వర రెడ్డి, ఎస్. సుబ్రమణ్యంరెడ్డిలు రాష్ట్రాల వారీగా 8 స్థానంలో నిలిచారు. వీరి సంపద రూ.5100 కోట్లుగా ఉంది. నగరాల వారీగా టాప్ డెలపర్లలో జూపల్లి రాము రావు, జూపల్లి శ్యామ్ రావులు, జూపల్లి రంజిత్ రావు,జూపల్లి వినోద్ లు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరి సంపద రూ.740 కోట్లు. జూపల్లి రామేశ్వరరావు రూ. 710 కోట్ల సంపదతో 58వ స్థానంలో ఉండగా.. జీవీకే రెడ్డి తాజ్ జీవీకే హాస్పిటాలిటీ పేరుతో 65వ స్థానంలో నిలిచారు. టాప్ 100 మందిలో జూపల్లి రాము, జూపల్లి శ్యామ్ అత్యంత చిన్న వయస్సు గలవారు (33) కావడం విశేషం.
దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వేత్తగా లోధా డెవలప్పర్స్ అధినేత మంగళ్ ప్రభాత్ లోధా రికార్డ్ సష్టించారు. రూ.31,960 కోట్ల ఆస్తులు కలిగిన మంగళ్ ప్రభాత్ లోధా అండ్ ఫ్యామిలీ ఆఫ్ మ్యాక్రోటెక్ డెవలప్పర్స్ (గతంలో లోధా డెవలప్పర్స్ గా పిలిచేవారు) రియల్ రంగంలో రారాజుగా మారిపోయినట్లు హురన్ రిపోర్ట్ అండ్ గ్రోహే ఇం డియా తెలియ జ?సింది. లోధా తర్వాత డీఎల్ఎఫ్ వైస్ చైర్మన్ రాజీవ్ సింగ్, ఎంబసీగ్రూప్ వ్యవ స్థాపకుడు జితేం ద్ర వీర్వాని ఉన్నారు.హురన్ రిపోర్ట్ అండ్ గ్రోహే ఇండియా సంస్థ 2019 సంవత్సరానికి గానూ ప్రకటించిన 100 మంది రియల్ ఎస్టేట్ సంపన్నుల జాబితాలో లోధా మొదటి స్థానాన్ని కైవశం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం బీజేపీ ముంబై చీఫ్‌గా ఉన్న లోధా అటు రాజకీయంగా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణిస్తున్నారు. లోధా కుటుంబ సంపద 2019 లో 18 శాతం పెరగ్గా.. మిగతా 99 మంది రియల్టర్ల ఆస్టులు 12 శాతం పెరిగినట్లు గ్రోహే ఇండియా ప్రకటించింది.లోధా తర్వాత రెండో స్థానంలో ఉన్న రాజీవ్ సింగ్ డీఎల్ఎఫ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన సంపద రూ.25,080 కోట్లుగా ఉంది. 2018 తో పోలిస్తే రాజీవ్ సింగ్ సంపద 42 శాతం పెరిగాయి. మూడో స్థానాన్ని కైవశం చేసుకున్న జితేంద్ర వీర్వాని బెంగళూరుకు చెందిన ఎంబస్సీ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ సంస్థ అధిపతిగా ఉన్నారు. ఈయన సంపద రూ.24,750 కోట్లుగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతంగా దూకుకుపోతున్న పారిశ్రామిక వేత్తల ఆస్తులు సెప్టెంబర్ 30, 2019 నాటికి లెక్కగట్టినట్లు గ్రోహే ఇం డియా ప్రకటించింది. లీస్టెడ్ కంపెనీల్లో మార్కెట్ పెట్టుబడులు, సంపద, లేటెస్ట్ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ తదితర అంశా లను ఆధారంగా చేసుకుని హురన్ రిపోర్ట్ అండ్ గ్రోహే ఇండియా నివేదికను తయారు చేసింది. హీరానందని కమ్యూ నిటీస్ గ్రూప్‌కు చెందిన నిరంజన్ హీరానందని అత్యంత సంపద కలిగిన రియల్టర్లలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద రూ.170.30 కోట్లుగా ఉండగా ఆ తర్వాతి స్థానంలో కె.రహేజా గ్రూప్ ఉంది.
రహేజా గ్రూప్‌కు చెందిన చంద్రూ రహేజా అండ్ ఫ్యామిలీ సంపద రూ.15,480 కోట్లు కాగా.. ఆరో స్థానంలో ఒబెరాయ్ రియాల్టికి చెందిన వికాస్ ఒబెరాయ్ ఉన్నారు. వికాస్ సంపద 2019 సెప్టెంబర్ 30 నాటికి రూ.13,910 కోట్లుగా ఉంది. ఏడో స్థానంలో బాగ్మే డెవలప్పర్స్ కు చెందిన రాజా బాగ్మే రూ. 9960 కోట్ల సంపద కలిగి ఉన్నారు. హౌస్ ఆఫ్ సింగపూర్ రియాల్టి సంస్థకు చెందిన సురేంద్ర హీరానందనీ రూ. 9720 కోట్ల సంపదతో ఎనిమిదో స్థానంలో ఉండగా.. ముంబైకి చెందిన సుభాష్ రున్వాల్ అండ్ ఫ్యామిలీ రూ.7100 కోట్ల సంపదతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. పదో స్థానంలో పిరమల్ రియాల్టి గ్రూప్ అధినేత అజయ్ పిరమల్ రూ. 6560 కోట్ల సంపదతో ఉన్నారు. మొత్తం 100 మందిలో భారతీయ రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వేత్తల సంపద రూ. 2,88,080 కోట్లుగా ఉంది. 2018తో పోలిస్తే వీరి సంపద 18 శాతం పెరిగింది. ఆర్థిక మందగమనం కారణంగా వ్యవస్థలో నగదు కొరతతో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నప్పటికీ రియల్ పారిశ్రామిక వేత్తల సంపద సరాసరి 16 శాతం పెరిగింది. అంటే రూ. 2,743 కోట్లు.