Arjun Suravaram Trailer released

నిఖిల్‌, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్‌ సురవరం. ఠాగూర్‌ మధు సమర్పణలో రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. మేము ఎంతో శ్రమించి తీసిన చిత్రమిది. అన్యాయాన్ని ఎదిరించే ఒక రిపోర్టర్‌ పాత్రలో నేను నటించాను అన్నారు నిఖిల్‌. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు సంతోష్‌. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి.