ఏపీకి కేంద్రం తీపి కబురు

Central Govt Released Funds For Polavaram Project

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలకు సంబంధించి కేంద్రం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,600 కోట్లలో రూ.1,850 కోట్ల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు త్వరలో నాబార్డు నుంచి నిధులు విడుదల కానున్నాయి. అయితే తొలుత రూ.3 వేల కోట్లు వరకు ఆమోదం వస్తుందని అంచనా వేసినప్పటికీ..మరికొంత పరిశీలన తర్వాత మరికొన్ని నిధులు విడుదలయ్యే అవకాశమున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం మరికొన్ని వివరణలు కోరే అవకాశముంది.