Minister Niranjan Reddy in Netherlands

ఐటీ ఎగుమతుల్లో భారతదేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని, విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో భారత దౌత్య కార్యాలయం నిర్వహించిన డచ్‌ ట్రేడ్‌ మిషన్‌ పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా మిషన్‌ సభ్యులను మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విత్తన ఎగుమతులపై నెదర్లాండ్స్‌, తెలంగాణ మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో విత్తన పరిశ్రమ అభివృద్ధికి, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన వేరుశనగ సాగుకు సహకారం అందిస్తామని ట్రేడ్‌ మిషన్‌ హామీ ఇచ్చింది. సదస్సులో తెలంగాణ ఏపీసీ పార్థసారథి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు, సంస్థ డైరెక్టర్‌ కేశవులు పాల్గొన్నారు.