క్రెడాయ్‌ స్థిరాస్తి ప్రదర్శన

CREDAI Property Show on 9th to 10th Nov 2019

క్రెడాయ్‌ హైదరాబాద్‌ మొట్టమొదటిసారిగా తూర్పు హైదరాబాద్‌లో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తోంది. ఎల్‌బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. 55 మందికి పైగా డెవలపర్లు, బ్యాంకర్లు, నిర్మాణ సామగ్రి తయారీదారులు ప్రదర్శనలో పాల్గొంటారు. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ల వివరాలను ఒకే చోటు తెలుసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఐటీ కారిడార్‌లో చేపడుతున్న ప్రాజెక్ట్‌ల వివరాలు తెలుసుకోవచ్చు.