72nd cannes film festival

అందాల తారల తళకుబెళుకుల మధ్య 72వ అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుక జోరుగా హుషారుగా ప్రారంభమైంది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో ఈ వేడుక మొదలైంది. ది డెడ్‌ డోన్ట్‌ డై సినమా ప్రీమియర్‌ షోతో ఈ చిత్రోత్సవాన్ని ప్రారంభించారు. ఈ చలన చిత్రోత్సవం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ఈ వేడుకలో తొలిరోజు ప్రముఖ పాప్‌ గాయని సెలీనా గోమేజ్‌తో పాటు పలువురు హాలీవుడ్‌ అందాల భామలు రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. పలువురు సుందరాంగులు వయ్యారాలు ఒలకబోసి మురిపించారు. ఇక మన దేశం నుంచి ఎ.ఆర్‌. రెహమాన్‌, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ విశన్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్‌ భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, ఐశ్వర్యారాయ్‌, సోనమ్‌ కపూర్‌, కంగనారనౌత్‌లు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడి చేయనున్నారు.