13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు – మొదటి ప్రకటన
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & సిలికానాంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 21-22, 2023 తేదీలలో 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు మిల్పిటస్, కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం లో జరుగుతుంది. జాతీయ స్థాయిలో కేవలం తెలుగు భాషా, సాహిత్యాలకి మాత్రమే పెద్ద పీట వేసి 1998 లో ప్రారంభం అయిన ప్రతిష్టాత్మకమైన అమెరికా తెలుగు సాహితీ సదస్సుల పరంపరలో అట్లాంటా, చికాగో, డిట్రాయిట్, న్యూ జెర్సీ, హ్యూస్టన్, ఫ్రెమాంట్, ఇండియానాపోలిస్, వాషింగ్ టన్ డి.సి, ఆర్లండో, టొరంటోల తర్వాత ప్రత్యక్ష వేదిక మీద జరుగుతున్న ఈ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు అందరూ ఆహ్వానితులే. ఈ సదస్సు ప్రధాన కార్యనిర్వాహకులుగా ఈ క్రింది వారు వ్యవహరిస్తారు. అదనపు కార్య నిర్వాహక సభ్యుల వివరాలు త్వరలోనే ప్రకటించబడతాయి.
సదస్సు అధ్యక్షులు: ఆనంద్ కూచిభొట్ల (సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం), వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా)
సంచాలకులు (Convenors): మృత్యుంజయుడు తాటిపాముల, శాయి రాచకొండ
ఆహ్వాన సంఘం అధ్యక్షులు: రాజు చమర్తి
కార్యదర్శి: శ్రీదేవి గంటి
భారత దేశ సమన్వయ కర్త: డా. సి. మృణాళిని, హైదరాబాద్
అమెరికా, కెనడాల నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 మంది రచయితలు, కవులు, పండితులు, సాహితీవేత్తలు, భాషా, సాహిత్యాభిమానులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సాహితీ సదస్సు లో భారత దేశంతో సహా అన్ని దేశాలలోని స్నాతకోత్తర విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్ధుల పత్ర సమర్పణకి ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. అన్ని ప్రసంగ వ్యాసాలూ సభా విశేష సంచిక (Proceedings of the Conference) లో ప్రచురించబడతాయి. సదస్సు వివరాలు త్వరలోనే ప్రకటించబడతాయి.
భవదీయులు,
13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
సంప్రదించవలసిన చిరునామాలు: vangurifoundation@gmail.com, WhatsApp: 1 832 594 9054