ఆ సీన్ చేసేటప్పుడు చాలా భయంవేసింది

Ramya krishna says about Sivagami role in baahubali

మూడు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్‌ ను విజయవంతంగా కొనసాగిస్తూ వస్తుంది రమ్యకృష్ణ. ఇప్పుడు తన పేరునే మార్చేసింది బాహుబలిలోని శివగామి పాత్ర. కాగా ఈ సినిమాలో ఓ సీన్‌ చేసేపటప్పుడు రమ్యకృష్ణకు చాలా భయం వేసిందట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివగామి క్యారెక్టర్‌ కు తాను ఎలాంటి హోమ్‌వర్కూ  చేయలేదని, రాజమౌళి ఎలా చెప్పితే అలా నటించానని చెప్పింది. ఈ సినిమాలో నీటిలో మునిగి బిడ్డను పట్టుకునే సీన్‌ చేసేటప్పుడు చాలా భయపడిందని చెప్పింది. ఆ సీన్‌ చేయడం ఒక సవాలుగా మారిందని చెప్పింది. ఆ షూటింగ్‌ ను కేరళ లోని నీటి ప్రవాహం అధికంగా ఉండే చల్లకుడి జలపాతంలో చేశారు. వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి దిగి తాను చేతులు బయటకి పెట్టాలి.  మొత్తాని ఆ సీన్‌ భయపడుతూనే చేశానని చెప్పింది రమకృష్ణ.