
చిన్నప్పటి నుంచీ సంగీతం, కళలు అంటే ఇష్టం. అయితే వాటిపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. పాఠశాలకు వెళ్లే సమయంలో పాశ్చాత్య సంగీతం ఎక్కువ వినేవాణ్ని. శంకరాభరణం తరువాత కర్నాటక సంగీతంపై మక్కువ పెరిగిందన్నారు ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్. దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ కె.విశ్వనాథ్నిన అభినందించారు. హైదరాబాద్‌లోని విశ్వనాథ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. స్యయంకృషి సమయంలో అన్నయ్యతో కలసి సెట్‌కి వెళ్లేవాడ్ని. సినిమాల్లోకి వచ్చాక విశ్వనాథ్‌గారిని కలుసుకొన్నది లేదు. విశ్వనాథ్ సినిమాలన్నీ ఇష్టమే కానీ, ఆయనతో సినిమా చేయాలని అనిపించలేదు. ఎందుకంటే నాకు అంత నటన రాదు కాబట్టి అంటూ నవ్వేశారు పవన్. త్రివ్రికమ్ మాట్లాడుతూ విశ్వనాథ్‌గారి ప్రతి చిత్రమూ ప్రత్యేకమే. అయితే అందులోంచి పన్నెండు చిత్రాల్ని ఎంచుకొని డీవీడీ రూపంలో స్పెషల్ ఎడిషన్‌గా తీసుకొద్దామనుకొంటున్నాం అన్నారు.