అనుష్క గొప్ప నటైతే కాదు: రాజమౌళి!

rajamouli comments on anushka acting

కథానాయిక ప్రాధాన్యత వున్న సినిమాల్లో వరుసగా గ్లామర్‌ డాల్‌గాను, మరోవైపు ఉత్తమ నటిగానూ గుర్తింపు పొందిన అనుష్క గొప్ప నటి కాదని దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమె గొప్ప నటి అని చెప్పలేం కానీ ప్రొఫెషనల్‌ నటి అని మాత్రం చెప్పగలను. చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆకళింపు చేసుకొని నటించే ప్రయత్నం చేస్తుంది. ఎవరితో ఎలా మసలుకోవాలో ఆమెకు తెలిసినట్లుగా మరెవరికి తెలియదని నా ఉద్దేశ్యం. నటనాపరంగా నేను ఎక్కువ మార్కులు అమెకు ఇవ్వలేను. అయితే ఏ అంచనాలు లేకుండా బాహుబలి షూటింగ్‌కు  వెళ్లాక అమె నటనను చూసి ఆశ్చర్యపోయాను. రమ్యకృష్ణలాంటి నటికి ఎదురునిలబడి నటించగల సత్తా, మెప్పించగల నేర్పు చూసి ఆనందించాను అని లోపాయికారిగా అనుష్క గురించి చెప్పాడు జక్కన్న.