ధర్మవరం పట్టుచీరపై బాహుబలి-2

Baahubali Movie Fever Reach Dharmavaram Handloom Weavers

బాహుబలి-2 మానియా ధర్మవరం పట్టుచీరపైకి ఎక్కింది. చిత్రం పేరు, నటీనటులు, నిర్మాతల పేర్లు పట్టుచీరపై నేసి ధర్మవరం పట్టుకు ఉన్న స్థానాన్ని మరోసారి రుజువు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కళాకారుడు అన్వర్‌ భాషా. పట్టణంలోని కొత్తపేటకు చెందిన అన్వర్‌ బాషా బాహుబలి-2 చిత్రం పేరును ధర్మవరం పట్టుచీరపై అత్యంత నైపుణ్యంతో ఆవిష్కరించారు. అలాగే చిత్రంలోని ముఖ్య పాత్రధారులైన బిజ్జాలదేవుడు, శివగామి, అవంతిక,  భళ్ళాలదేవ, కట్టప్ప, అమరేంద్రబాహుబలి, దేవసేన పేర్లతో పాటు నిర్మాతలు శోభు, ప్రసాద్‌, దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి,  కెమెరామెన్‌ సెంథిల్‌ పేర్లను నైపుణ్యంతో ధర్మవరం పట్టుపై ముద్రించారు. ఈ చీరను తన సృగృహంలో ఆవిష్కారించాడు. ఈ సందర్భంగా అన్వర్‌ బాషా మాట్లాడుతూ ధర్మవరం పట్టుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, బాహుబలి చిత్రానికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఆ చిత్రం పేరు, నటుల పేర్లను పట్టుచీరపై మూడురోజుల్లో నేశానన్నారు. పట్టుచీరకు ఇరువైపులా బాహుబలిలో అందరిని ఆకట్టుకునే కట్టప్ప కత్తిని ముద్రించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి.