
నాకు బాగా తెలిసిన వ్యక్తే నన్ను రేప్ చేశాడు. ఈ విషయం నేను అందరికీ చెప్పుకోలేకపోయాను ఎందుకంటే నేను రేప్ బాధితురాలిగా వుండదలచుకోలేదు అంటూ తనపై జరిగిన లైంగిక దాడిని గురించి బాధాతప్త హృదయంతో వెల్లడించింది అమెరికన్ సినీ నటి అబిగెయిల్ బ్రెస్లిన్. తనతోపాటు హాలీవుడ్ నటీలు కొందరు రేప్‌కు గురయ్యారని అన్నారు. అయితే తనతో రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తే నన్ను నమ్మించి రేప్ చేశాడు. కాబట్టి నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే నేను రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి నన్ను రేప్ చేశాడని చెబితే పోలీసులు నమ్మరు అనే భయం వుంది. అందుకే నిందితుడిపై పోలీసుల కేసు నిలవకపోతే నాతోపాటు నా కుటుంబసభ్యులను ఎక్కువగా టార్చర్ పెడతాడు. తనకు అన్యాయం జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఇదే. 19 ఏళ్ల వయస్సులో తనపై జరిగిన రేప్‌ను దిగమింగుతూనే తనవలే రేప్‌కు గురైన బాధితులకు అండగా నిలుస్తోంది బ్రెస్లిన్. ఇటీవట తన గతాన్ని ఇన్‌సాగ్రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తనపై జరిగిన అత్యాచారాన్ని మరిచిపోవడానికి తాను ప్రకృతి చికిత్స చేయించుకున్నానని, దాంతో చాలా పురోగతి కనిపించిందని ఆవేదన వ్యక్తం చేసిన బ్రెస్లిన్ అప్పుడప్పుడు గతం గుర్తుకు వస్తే నిద్రపట్టేదికాదని తెలిపింది.