YSRCP MP YS Avinash Reddy Comments on Chandrababu

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక  హోదా రాకుండా చేశారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేకహోదా కావాలని డిమాండ్‌ చేసారా? గతంలో ఆయనకు అనుకూల పత్రికలు, మీడియాలలోో చూస్తే 29 సార్లలో ఎప్పుడు హోదా అడిగిన పాపాన పోలేదు అనే విషయం భోధపడుతుంది. గుంటూరులో ప్రత్యేకహోదా కోసం ఆమరణదీక్ష చేస్తుంటే నరేంద్రమోది వస్తున్నారని దీక్షను తీసేయించి వంచన చేసింది చంద్రబాబు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని బావించి మాచేత రాజీనామా చేయిస్తూ టిడిపి ఎంపీలతో కూడా రాజీనామా చేయించమని కోరితే తప్పించుకోవడం వంచన కాదా. అలా చేయించి ఉంటే దేశమంతా ఆంద్రప్రదేశ్‌ వైపు చూసేది కదా. మీరు చేస్తున్న దీక్షలో ధర్మం ఉందా పోరాటంలో పోరాటం ఉందా అని ప్రశ్నించారు. 1971 లో విశాఖలో ఉక్కుపరి్రÔ¶ మకోసం పోరాడిన చరిత్ర ఉంది ఆ పోరాటస్పూర్తితో ప్రత్యేకహోదా సాదిద్దాం.

ఎంఎల్‌ ఏ కోడుమూరి శ్రీనివాసులు కామెంట్స్‌ 

ప్రత్యేకహోదా గురించి పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎందుకు అడగలేదు. హోదా వస్తుంది తమందరి తమ పిల్లల భవిష్యత్తు బాగంటుందని బావించారు. హోదా కావాలని జగన్‌ అడిగితే హేళన చేసారు. మళ్లీ మీరే యూటర్న్‌ తీసుకుని హోదా కావాలంటున్నారు. ఓటుకునోటు విషయంలో ప్రత్యేకహోదా తాకట్టు పెట్టి ఈరోజు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు.

మీరు ఇంకుడుగుంటలు, నీరు చెట్టు అంటూ దోపిడికి పాల్పడి ఈరోజు ప్రత్యేక హోదా అంటే ప్రజలను వంచించడం కాదా. మీరు ఎందుకు ప్రజలను మోసం చేశారు. మాటతప్పారు ప్రజలకు సమాధానం చెప్పాలి. హోదా ఉద్యమాన్ని కాపాడుకుంటూ వచ్చింది జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రజాసంకల్పయాత్ర డామేజ్‌ చేయడానికి ప్రయత్నించి ప్రజల ఆశీస్సులుండటంతో తోక ముడిచారు. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపిలు తమ పదవులను సైతం త్యజించి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసారు. మీకు కూడా చిత్తశుద్ది ఉంటే ధర్మదీక్షలు డిల్లీలో చేయండి అప్పుడు నేషనల్‌ మీడియా అంతా ఉంటారు వారు వాస్తవాలు ప్రజలకు చెబుతారు. 600 వాగ్దానాలు చేసి ఈరోజు వాటిని నెరవేర్చకుండా ధర్మపోరాటం అంటారా కాదు అది వంచన పోరాటం. మీ ఎంపిలతో రాజీనామాలు ఎందుకు చేయరు.మీరు అలా చేయించి రండి మేమందరం మీకు అండగా ఉంటాం.మద్దతు ఇస్తాం. రానున్న రోజులలో వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు అభివృద్ది పధంలో పయనిస్తుంది.

మంగళగిరి ఎంఎల్‌ ఏ ఆర్‌ కె కామెంట్స్‌ 

నాలుగు సంవత్సరాల కాలంలో వాగ్దానాలను అమలు చేయకుండా దోపిడిపై దృష్టిసారించారు. విభజన హామీలు కాని ప్రత్యేక హోదా పై కేంద్రంపై కనీస వత్తిడి చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను తన కుమారుడు, మంత్రిమండలి సభ్యులు  కలసి ప్రజల సొత్తును దోచుకుంటూ కాలం గడిపారు. చంద్రబాబు అవినీతి అక్రమాలను ప్రశ్నిద్దాం, కాని హోదా, విభజన హామీల తీర్మానాన్ని మాత్రం ఆమోదిద్దాం అని అసంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన  తీర్మానాలకు మద్దతు ఇచ్చాం.

ప్రతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను, వామపక్షాలను, ప్రజాసంఘాలను ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమిస్తే వారిని అణిచివేసిన విషయం వాస్తవం కాదా ఉద్యమించేవారిపై కేసులు పెట్టి ఈరోజు నువ్వు ధర్మదీక్ష చేయడం వంచన కాదా అని ప్రశ్నించారు. నరేంద్రమోది, చంద్రబాబు ఇద్దరు కూడా మోసం చేసారు. ప్రత్యేకహోదా వచ్చిఉంటే యువతకు ఉద్యోగాలు, పలు ప్రాంతాలలో పరిశ్రమలు వచ్చిఉండేవి. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి  వెంకయ్యనాయుడు అని కూడా ఆర్‌ కె విమర్శించారు. పేద ప్రజల కోసం జగన్‌ పోరాడుతుంటే ఆయనకుఅండగా ఉండాల్సింది పోయి మౌనంగా ఉంటున్నారు. మీరు ఆరోజు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మీ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయండి.

మాజి ఎంఎల్‌ ఏ కన్నబాబు కామెంట్స్‌ 

విభజన సమయంలో నేను ఎంఎల్‌ ఏగా ఉండటం దురదృష్టకరం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోవడంతో  రాష్ట్రానికి బ్యాడ్‌  టైమ్‌ స్టార్ట్‌ అయింది. కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసింది.బిజేపి అన్యాయాలను  సరిచేస్తానని చెప్పింది. అది అందరూ నమ్మారు.బిజేపి అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా, విభజన హామీలు నెరవేరుస్తామని తెలిపారు. హోదా కు ప్యాకేజికి పెద్ద తేడాలేదు. దానిలో ఉన్నవన్నీ ప్యాకేజిలో కూడా ఉన్నాయని మబ్యపుచ్చారు చంద్రబాబు. కాని వైఎస్‌ జగన్‌ మాత్రం ప్యాకేజి వద్దు ప్రత్యేక హోదాఏ కావాలని ఊరూరా తిరిగిన వ్యక్తి ప్రజలను చైతన్యపరిచారు. ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. జగన్‌ మోహన్‌  రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించుకుని వచ్చే ఐదో తేదీన వైసిపిలో చేరుతున్నాను. చాలామంది నాయుకులు అనుకుంటున్నారు నాకు సీటు ఇస్తానంటే పార్టీలో చేరానని. నేను సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని హామీ ఇచ్చి వచ్చాను. అందరం కలిసి జిల్లాలో పనిచేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చేలా  చేద్దాం. గతంలో  జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుందాం. ఐక్యంగా జగన్‌ నాయకత్వంలో పనిచేద్దామని వివరించారు.

గౌరు చరితారెడ్డి కామెంట్స్‌ 

ప్రత్యేకహోదా మన డిమాండ్‌ కాదు. మన హక్కు. విభజన సమయంలో ఇచ్చిన హామీలలో భాగం. హోదా నినాదం బతికిందంటే జగన్‌ వల్లనే. ప్రతిపక్షనేతగా ఉండి దీక్షలు ధర్నాలు, ఆందోళనలు చేయబట్టే ఈ పరిస్దితి ప్రత్యేకహోదాకు వచ్చింది. చంద్రబాబు ప్రత్యేకహోదా అవసరం లేదు ప్రతేకప్యాకేజి చాలు అని అన్నారు. హోదా రావడం వల్ల మన పిల్లలకు ఎంతో ఉపయోగకరం అని అందరికి తెలుసు. హోదా రాకుండా చేయడంలో టిడిపి బిజేపిలు రెండూ  ద్రోహులే. ఏడాది అధికారం ఉన్నా కూడా హోదా సాధనకోసం రాజీనామాలు చేసి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణదీక్షలు చేసారు. బిజేపితో నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి ప్రజలలో వ్యతిరేకత చూసి ఇప్పడు ఎన్‌ డి ఎనంచి బయటకువచ్చి బిజేపితో జగన్‌ కలసి పోతున్నారంటూ  విషప్రచారం చేస్తున్నారని తెలిపారు. విషప్రచారం  ప్రజలు ఏమాత్రం నమ్మరని చంద్రబాబు కుట్రలను  వమ్ము చేస్తూ జగన్‌ ను అదికారంలోకి తేవాలని  కోరారు.

కరుణాకర్‌ రెడ్డి కామెంట్స్‌ 

చంద్రబాబు ధర్మదీక్ష చేస్తున్నారంటే రాక్షసులు రాజకీయ యాగం చేసినట్లు అని చంద్రబాబు ఎన్నివిధాలుగా ప్రజలను బెదిరించినా నాలుగు సంవత్సరాల కాలం ప్రత్యేకహోదా నినాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లిన వ్యక్తి జగన్‌ అన్నారు. ప్రత్యేకహోదా నినాదాన్ని ప్రజల నాలుకపై రామనామజపంలా చేసిన వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రజలను అడుగడుగునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రత్యేకహోదా ఇచ్చే బాద్యత నాది అని నరేంద్రమోది అంటే తెచ్చే బాద్యత నాది అని చంద్రబాబు అన్నారు. కానీ తర్వాత ప్రజలను వంచించారు.

చంద్రబాబు ఈరోజు తిరుపతిలో  దీక్ష చేసేముందు వెంకన్నసాక్షిగా క్షమాపణలు  చెప్పి తర్వాత దీక్ష చేయాలని డిమాండ్‌ చేసారు. నరేంద్రమోదికి సాగిలపడ్డామని చంద్రబాబు జగన్‌ గురించి అంటుంటారు. మా పార్టీ నేతలు ఎంపిలు ఎంఎల్‌ ఏలు ఎంల్సిలు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేసారు. గుంటూరలో జగన్‌ హోదా కోసం దీక్ష చేస్తుంటే నరేంద్రమోది వస్తున్నారని దీక్షను భగ్నం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ధర్మపోరాటదీక్ష అంటూ వెంకటేశ్వరుని సన్నిదిలో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను సైతం పావుగా వాడుతున్నారు. చంద్రబాబు వంచనలు ద్రోహాలను భరించే శక్తి పోయింది. చంద్రబాబు దుర్మార్గాలను అరికట్టేలా  పోరాడతామని  తెలిపారు.

ఎంఎల్‌ ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కామెంట్స్‌ 

నరేంద్రమోదిని నిలదీస్తే ఓటుకు నోటుకోసం జైలుకు  పోవాల్సి వస్తుంది.రాజదాని  కుంభకోణం వెలుగులోకి వస్తుంది కాబట్టి ప్రత్యేకహోదా ఊసెత్తకుండా తన దోపిడీలను కొననాగించారు. ప్రత్యేకహోదా విషయంలో టిడిపి చేసిన మోసం ప్రజలకు అర్దమైంది. మోసం చంద్రబాబు నైజం. మోసంతోనే రాష్ట్రంలో రాజకీయాలు సాగించాను అనేది చంద్రబాబు ఎప్పుడు చెప్పే విషయం. మోసం వంచన మామూలే మరోసారి వంచన చేస్తా...మరోసారి మోసం చేస్తా అని దీక్షలు చేస్తున్నారు. నరేంద్రమోది వద్ద చంద్రబాబు మంత్రులు తాబేదార్లగా పనిచేసారు. ఎన్నికలు వచ్చే వేళ చంద్రబాబు మరోసరికొత్త డ్రామాకు తెరతీసారు. 

నరేంద్రమోది, చంద్రబాబు జోడి కలసి చేసిన మోసానికి వ్యతిరేకంగా ఈ దీక్ష చేస్తున్నాం చంద్రబాబుకు మీడియా అనుకూలం...అందుకే నరేంద్రమోదికి జగన్‌ భయపడుతున్నారు అని ప్రచారం  సాగిస్తున్నారు. చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా. వెన్నుపోటు, అరాచకం, మోసం వంచన మీకు తెలిసిన విద్యలు. ఎదుర్కొవడం, ధైర్యం, సాహసం, పోరాటం మా నేత జగన్‌ నైజం. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుంది మీరు. సోనియాగాందిని ఆఎదిరించి నిలుచుని పార్టీని పెట్టి రాష్ట్ర అబివృద్ది కోసం నిలబడ్డ వ్యక్తి జగన్‌. 

వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ఎంఎల్‌ ఏలందరం రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నాం. మేమేకాదు, కింది స్దాయినుంచి ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేస్తే సంక్షోబం సృష్టిస్తే ప్రత్యేకహోదా ఉద్యమం బలంగా తయారవుతుంది. మీరు మీ కుమారుడు రాష్ట్ర ప్రజలకు చేసిన వంచనకు మోసాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తన్నాం. రానున్న ఎన్నికలలో ప్రజలు జగన్‌ ను గెలిపిస్తారు.జగన్‌ సిఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. 

ఎంఎల్‌ ఏ రాజన్నదొర కామెంట్స్‌ 

ప్రత్యేకహోదా రాకపోవడానికి మూలకారకుడు చంద్రబాబు. రాష్ట్రవిభజన కు సైతం కారణం  చంద్రబాబు. హోదా సాధనకోసం జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగడున కృషి చేస్తుంటే చంద్రబాబు ఇటీవల కొంగజపంచేసారు. రాష్ట్రప్రజలను నిలువునా మోసం చేసింది చంద్రబాబు. వైసిపి బిజేపితో కుమ్మక్కైవుతుందని దుష్ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికి తెలుసు  ప్రత్యేకహోదా కోసం ఎవరు పోరాడుతున్నారో ఎవరు ద్రోహం చేస్తున్నారో. ఇలాంటి పరిస్దితిలో మనందరం వైఎస్‌ జగన్‌ కు అండగా నిలవాలి.

ఎంఎల్‌ ఏ శ్రీ జగ్గిరెడ్డి కామెంట్స్‌ 

చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో తిరిగి అదికారంలోకి రావాలని చూస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత రాష్ట్ర చిన్నాబిన్నం అవుతున్నతరుణంలో నేనున్నానంటూ జగన్‌ ముందుకు వచ్చారు. ఈరోజు వంచన చేస్తుంది చంద్రబాబు. ప్రత్యేకహోదా నరేంద్రమోది తోకలసి తెస్తానని చెప్పి నాలుగుసంవత్సరాలు అంటకాగి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని  తిరిగి మోసాలకు బయల్దేరారు. 15ఏళ్లు  ప్రత్యేకహోదా  తెస్తానని చెప్పింది నీవా లేక నీ డూపా. వెంకన్న స్వామి సమక్షంలో చంద్రబాబు  ఈరోజు  నిజాలు చెప్పాలి. విశాఖలో సమిట్‌ లు పెట్టి 19 లక్షల కోట్లు పెట్టుబడులు  తెచ్చామని  చెబుతూ ప్రజలను మభ్యపుచ్చుతున్నారు. విశాఖలో భూములు ఎక్కడక్కడ దోచుకున్నారు. ప్రత్యేకహోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని బావించారు.

శ్రీధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌ 

చంద్రబాబు నీ మాటకు ఎలాంటి విలువలేదు.....ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి వారి వారి రాష్ట్రాలకోసం ఎంతలా పోరాడుతున్నారు. మన ముఖ్యమంత్రి మాత్రం చట్టప్రకారం రావాల్సిన ప్రత్యేకహోదా వద్దు.  ప్యాకేజి కావాలని అన్నారు. వారు ఏదో ప్యాకేజి అంటూ ప్రకటిస్తే దానికి ఆనందంగా స్వీకరించి ఆదేదో వరప్రసాదం అంటూ వారికి ధాంక్స్‌ పా ్పవు. నీవు దీక్ష చేస్తానంటావు....అందర్ని నాలుగు సంవత్సరాలు మోసం చేసి.ఇప్పుడు తిరిగి అదికారం కావాలని కోరుకుంటావు.నీకు ఎందుకు అదికారం ఇస్తారు.

ఈ ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను చైతన్యపరిచేందుకుప్రయత్నిస్తుంది దానిలో బాగంగానే  దీక్ష చేస్తున్నాము. 2019 ఎన్నికలలో కేంద్రం లో ఏ పార్టీ అదికార ంలోకి వచ్చినా ప్రత్యేకహోదా, విభజన  హామిలు ఆంద్రప్రదేశ్‌  కు ఏ పార్టీ నెరవేరుస్తుందో ఆ పార్టీతోనే మా ప్రయాణం అని జగన్‌ చెప్పారు ఎంత క్లారిటి ఉంది.రాష్ట్రానికి మేలు చేసే ఆ నిర్ణయం పట్ల అందరూ హర్షిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పధకాలలో అవినీతి విచ్చలవిడిగా ఉంది.గ్రామీణ ఉపాది హామీ పదకం దగ్గర్నుంచి మరుగుదొడ్లువరకు అవినితి సాగుతోంది. రాష్ట్ర ప్రజలకు నాయకుడుగా ఉన్న వ్యక్తి దొంగపనులు చేసి ప్రజలే నన్ను రక్షించాలని కోరుతున్నారంటే నీ పరిస్దితి ఎలా ఉంది. రాజధాని భూములను అమ్ముకుని పోలవరం ప్రాజెక్ట్‌ లో అవినీతికి పాల్పడిన నీవు ప్రజలను అడగటం  ఎంతవరకు సమంజసం. 

శ్రీ కరణం ధర్మశ్రీ కామెంట్స్‌ 

తిరుపతిలో  చేస్తుంది దీక్ష కాదు..... టిడిపి,బిజేపిచేస్తున్న వంచనకు తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలతో ఎన్నుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ ఏలకు ఎంఎల్సిలకు జడ్‌ పిటిసి,ఎంపిటిసిలకు సర్పంచ్‌ లకు నిధులు లేదు. పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్తే మా పార్టీ పేరు చెబితే స్పందించడంలేదు. ఎప్పుడు చెప్పినా ఐదుకోట్లమంది ఆంధ్రులు నా పక్కన ఉన్నారని తెలిపారు.నీ పక్కన కనీసం సగం కూడా నీ పక్కన లేరు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేవరకు అందరూ నడుంకట్టాలి.  

గుడివాడ అమర్‌నాద్‌...

నాలుగేళ క్రితం టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు హమీ ఇచ్చాయి. వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు, దీక్షలు చేశారు. చంద్రబాబకు చిత్తశుద్దిలేదని ప్రజలకు అర్ధమైంది. చంద్రబాబు నీ కుమారుడు లోకేష్‌తో రెండు రోజులైనా నిరాహరదీక్ష చేస్తే సగం బరువు తగ్గేవాడు. పరకాల నీ భార్య బీజేపీలో కేంద్రమంత్రి, నువ్వు టీడీపీ  రాష్ట్రం గురించి మీకు ఎంత చిత్తశుద్ది ఉందో అర్దమవుతుంది.

కోన రఘుపతి కామెంట్స్‌ ,బాపట్ల ఎమ్మెల్యే

5కోట్ల ప్రజలను వంచించిన తీరుకు నిరసనగా జరుగుతున్న దీక్ష చంద్రబాబు తన తప్పేం లేదు బీజేపీదే మొత్తం తప్పు అన్న విధంగా వ్యవహరిçన్తున్నారు. యూటర్న్‌ అంకుల్‌ మళ్ళీ మోదీతో చేతులు కలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్‌ జగన్‌ మొదటినుంచి చెప్పినా చంద్రబాబు పెడచెవిన పెట్టారు.  

రెహమాన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది వైఎస్‌ఆర్‌ మాత్రమే. జలీల్‌ఖాన్‌ దొంగ, చాంద్‌బాష కనీసం కార్పొరేటర్‌ కూడా ‡కాదు. చంద్రబాబు నీ సైకిల్‌ తుక్కుతుక్కు చేస్తాం.  

నందమూరి లక్ష్మీపార్వతి కామెంట్స్‌ 

కాంగ్రెస్‌ను ఎదిరించిన వీరులు ఎన్టీఆర్‌ , వైఎస్‌జగన్‌ లు. వేలకొట్లు అడ్డదారిలో  దోచిన వాడు చంద్రబాబు. తాను అదికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు పెడతామని శ్రీ వైఎస్‌ జగన్‌  ప్రకటించడం సంతోషం. కంచె చేను మేసే వ్యక్తి నానుడికి సరిగ్గా సరిపోయే వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఎక్కడా ఆపలేదు.హోదా  లేకపోతే మనకు భవిష్యత్తు లేదు.అందుకే వైఎస్‌ జగన్‌ ఇప్పటికి ప్రజలను జాగృతం చేస్తున్నారు.చంద్రబాబుమాత్రం అదికారం కోసం ఎన్ని దొంగజపాలైనా  చేస్తారు.ఇందుకు ఆయన చేస్తున్న ధర్మపోరాటం,ధర్మదీక్షలే సా„ý ్యం.అదికారం కోసం ప్రజలను వంచనకు ద్రోహానికి గురిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు.

మా అల్లుడిని ఈ రాష్ట్రం నుంచే తరిమికొట్టండి.ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏ ఎజెండా లేక వైఎస్‌ జగన్‌ ఎజెండానే పట్టుకుని చంద్రబాబు ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం  చేస్తున్నారు. 

ప్రత్యేకహోదా కోసం రాజీనామా చేసిన పార్లమెంట్‌ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కామెంట్స్‌ 

ప్రత్యేకహోదా, విభజన చట్టంలో అంశాలు. దుగ్గరాజుపట్నం,కడప ఉక్కుఫ్యాక్టరి,విశాఖరైల్వేజోన్‌ ,లాంటి ఇవ్వాలని ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుతోంది. ఈరోజు ప్రత్యేకహోదా ఉద్యమం ఈస్తాయిలో ఉండటానికి కారణం వైఎస్‌ జగన్‌ మాత్రమే. ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నపుడు హైద్రాబాద్‌ ను మాత్రమే మనం అభివృద్ది చేసుకున్నాం. హైద్రాబాద్‌ దురదృష్టం శాత్తు యుపిఏ అడ్డగోలు విభజనతో  కోల్పోయం.

ఆంద్రప్రదేశ్‌ కేవలం వ్యవసాయా«ధరంగా మిగిలిపోతుందని పరిశ్రమలు రావాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకహోదాను విభజనచట్టంతోపాటు పెట్టారు. ప్రధాని నరేంద్రమోది, చంద్రబాబు, జనసేన పవన్‌ కల్యాణ్‌ కలసి సభలలో ప్రసంగిస్తూ ప్రత్యేకహోదా తెస్తామని చెప్పారు. దాంతో నమ్మి అదికారాన్ని ప్రజలు వారికి అప్పజెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోంది. గుంటూరులో వైఎస్‌ జగన్‌ ఆమరణదీక్ష చేస్తుంటే నరేంద్రమోడి వస్తున్నారని చెప్పి దీక్షను భగ్నం చేసారు. చంద్రబాబు ప్రత్యేకహోదా,వి¿¶ జన చట్టం అమలుకు ఎన్నడూ ప్రయత్నంచేయలేదు.

అరుణ్‌ జైట్లీ  హోదా ఇవ్వడంలేదు దానికి బదులుగా ప్యాకేజి ఇస్తున్నామని ప్రకటిస్తే దానిని ఆనందంగా తీసుకుని వారికి సన్మానాలు చేసిన ఘనత చంద్రబాబుది. తర్వాత పార్లమెంట్‌ లో కేంద్రంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వత్తిడి తెచ్చేందుకు పోరాటం చేసి అవిశ్వసం ప్రవేశపెట్టింది. ఇలా ధైర్యంగా నరేంద్రమోది పై రాష్ట్రం కోసం ఐదుకోట్ల ప్రజలకోసం వైఎస్‌ జగన్‌ పోరాటం ప్రార ంభించారు. చంద్రబాబు ఐధుగురుతో అవిశ్వాసం పెట్టి ఏమి సాధిస్తారని ఎకతాళి చేసారు.మొదట మేము ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని చెప్పి తర్వాత స్వార్దప్రయోజనాలకోసం టిడిపినే గంటల వ్యవధిలో మనస్సు మార్చుకుని వారే అవిశ్వాసం ప్రవేశపెట్టార. ఆ నేపద్యంలో కేంద్రం దిగిరాకపోతే జగన్‌ ఆదేశాలమేరకు మా పదవులకు రాజీనామా చేసాం.ఆరురోజులపాటు దీక్ష చేసిన స్పందన రాకపోవడంతో రాజీనామాలు చేసాం. తన ఎంపిలతో రాజీనామాలు చేయించలేని చంద్రబాబు 30 కోట్ల రూపాయలు పెట్టి ధర్మదీక్ష చేసారు. ఆరోజు సభ ప్రజల మద్దతు చూరగొనలేకపోవడంతో తిరిగి ఈరోజు తిరపతిలో ధర్మదీక్ష  చేస్తున్నారు.చంద్రబాబు అందర్ని వంచించి దీక్ష ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు.మా ప్రాణాలు ఉన్నంతవరకు ప్రత్యేకహోదా కోసం పోరాడుతూనే ఉంటామని సుబ్బారెడ్డి  స్పష్టం చేసారు.

మాజి మంత్రి మోపిదేవి వెంకటరమణ కామెంట్స్‌ 

ప్రత్యేకహోదా ను  మేమిప్పాస్తామంటే మేమంటూ ప్రధాని నరేంద్రమోది,చంద్రబాబులు ప్రజల ఎదుట ప్రగల్బాలు పలికారు.అయితే విభజన సమయంలో అనుభవం ఉన్న వ్యక్తి  ఉంటే బాగుంటుందని చంద్రబాబును ప్రజలు  నమ్మి గెలిపించారు.అయితే ఆ మరుక్షణంలోనే ఆయన ప్రజలను వంచించడం ప్రారంభించారు. ప్రత్యేకహోదా అనేది అపర సంజీవనిలాంటిదని అందరూ బావిస్తుంటే హోదా అక్కర్లేదు ప్యాకేజి చాలు అని హోదా డిమాండ్‌ ను నీరుగార్చారు. అన్ని రకాలుగా అభివృద్దికి ప్రత్యేకహోదా అవసరం అనే విషయాన్ని తుంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు రాష్ట్ర వాప్తంగా ప్రజలను వైఎస్‌ జగన్‌ చైతన్యపరచడమేకాదు....యువతను యువభేరిల ద్వారా జాగృతం చేసారు.

ఆనాడు వాజ్‌ పేయిప్రదాని గా ఉన్నపుడు హిమచల్‌  ప్రదేశ్‌ కు ప్రత్యేకహోదా ఇస్తే ఎంతో అభివృద్ది సాధించింది. హోదా విషయంలో జగన్‌ అలుపెరగని పోరాటంచేస్తున్నారు. తెలుగుదేశం పునాదులు కదిలే పరిస్దితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.కాబట్టి అందరూ జగన్‌ కు అండగా నిలబడాలని  కోరారు.

మాజి ఎంఎల్‌ ఏ గొల్లబాబూరావు కామెంట్స్‌ 

చంద్రబాబు సొంతమామనే వెన్నుపోటు పొడిచి అక్రమంగా రాజ్యాధికారంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగుఆత్మగౌరవంను ఏ రోజు కూడా అర్దం చేసుకోలేని వ్యక్తి చంద్రబాబు. వెంకన్న, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని వ్యక్తులుగా మోది, చంద్రబాబు నిలిచిపోయారు. మూడు వేల కిలోమీటర్లు ఎండలలో అలుపెరగకుండా ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారు వైఎస్‌ జగన్‌. ప్రత్యేకహోదా వచ్చేవరకు జగన్‌ నేతృత్వంలో ఎన్ని ప్రాణాలైనా అర్పించి పోరాటం సాగిద్దామని తెలిపారు.

ఎంఎల్‌ ఏ ఆదిమూలపుసురేష్‌ కామెంట్స్‌ 

బిజేపి ఆంద్రప్రదేశ్‌ ప్రజలను వంచించింది....మరి మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖలో...తిరుపతిలో టిడిపి వేర్వేరుగా ఎందుకు చేస్తున్నారు కలిసి చేస్తే బాగుంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాని రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీలు నెరవేరకపోవడానికి కారణం. బిజేపిపై ఎంత బాద్యత ఉందో తెలుగుదేశం పార్టీకి అంతే భాద్యత ఉంది. మన  పోరాటం రాష్ట్రం కోసం అయితే చంద్రబాబు పోరాటం స్వార్దప్రయోజనాల కోసం. ఇదే జగన్‌ కుచంద్రబాబు కు ఉన్న తేడా. గణతంత్ర దినోత్సవం రోజున ప్రత్యేకహోదా కోసం నిరసన తెలియచేద్దామనివస్తే శ్రీ వైఎస్‌ జగన్‌ ను  ఎలానిర్బందించారో ప్రజలందరికి తెలుసు.

జల్లికట్టులా పోరాటం చేయాలని అందరూ అంటుంటే సుజనాచౌదరి పందుల పోటీలు పెట్టుకోండి...అని అవహేళన  చేశారు. నోట్లరద్దులాగా హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పిన విషయం అందరికి గుర్తు ఉంది. రాజకీయలబ్ది కోసమే టిడిపి హోదానినాదం చేస్తోంది.వారికి రావాల్సిన పోలవరం ప్యాకేజి ఇతర ప్యాకేజిలు వచ్చేశాయి. కాబట్టి వారికి హోదా అవసరం లేదు. అయినా ప్రజలలో సెంటిమెంట్‌ ఉందని నాటకాలు ఆడుతున్నారు. రానున్న రోజులలో జగన్‌ అన్నను సిఎం గా చేసుకోవాలి.