సీఎం చంద్రబాబుకు ప్రధాని, గవర్నర్‌ శుభాకాంక్షలు

Modi wishes Chandrababu Naidu good health on his 68th birthday

67 వసంతాలు పూర్తిచేసుకొని 68వ ఏట అడుగుపెడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, గవర్నర్‌ నరసింహన్‌,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు  పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల సీఎం పేరిటా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

 


                    Advertise with us !!!