Radha Spaces ASBL

2019 ఎన్నికల్లో సామాజికవేదికలదే కీలకపాత్ర

2019 ఎన్నికల్లో సామాజికవేదికలదే కీలకపాత్ర

2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కాకపోతే ఈసారి ప్రచారానికి సామాజికమాధ్యమాలపై ఎక్కువగా ఆధారపడాలని పార్టీలు భావిస్త్నున్నాయి. ఈ వేదిక ద్వారా ప్రచారం వల్ల ఎంతోమందిని ఆకట్టుకోవచ్చని కూడా ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేందుకు ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉన్నప్పటికీ, ఇంటర్‌నెట్‌ వేదికగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారపర్వానికి ఇప్పటికే పలు పార్టీలు తెరలేపాయి.

జాతీయ రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ ఈ సామాజికమాధ్యమ  యుద్ధంలో ముఖాముఖి తలపడుతుండగా, బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఈ యుద్ధంలో వచ్చి చేరుతున్నాయి. నిజానికి సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రక్రియ 2014 నుంచే మొదలైంది. అప్పటికే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, ఆన్‌లైన్‌ ప్రచారపర్వంలో అందరి కంటే ముందు దూసుకెళ్లారు. నిజానికి సోషల్‌ మీడియా ద్వారానే మోడీ ఆ స్థాయికి ఎదిగారని కూడా రాజకీయ వర్గాలు చెబుతాయి. ఆ ఎన్నికల్లో సోషల్‌ మీడియా విభాగంలో పెద్దగా దష్టిపెట్టని కాంగ్రెస్‌ పార్టీ, ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఇది కూడా ఒక కారణమని ఆలస్యంగా గుర్తించింది. 2015లో రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతా తెరవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఆన్‌లైన్‌ కదనరంగంలోకి అడుగుపెట్టింది.

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన ఓటర్ల సంఖ్య 90 కోట్లు దాటినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందులో సగానికి పైగా అంటే 50 కోట్ల మందికి మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉంది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన టెలీకాం సర్వీస్‌ ప్రొవైడర్లు పోటీ పడి మరీ మొబైల్‌ ఇంటర్‌నెట్‌ ధరలు తగ్గించి పూర్తిగా చౌకగా మార్చడం రాజకీయ పార్టీలకు మరింత అనువుగా మారింది. అతి తక్కువ సమయంలో కోట్లాది ఓటర్లను చేరుకునే మార్గమైన సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ రాజకీయ పార్టీలు తమ ప్రచా రాన్ని ఉధతం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తించిన భారతదేశంలో ఇప్పుడు సోషల్‌ మీడియా విస్తతి, వినియోగం, ఎన్నికల ప్రచారంలో దాని పాత్ర ఒక పరీక్షగా మారాయి.

మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వినియోగి స్తున్న వారిలో 30 కోట్ల మందికి పైగా ఫేస్‌ బుక్‌ వినియోగిస్తున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే వాట్సప్‌ వినియోగిస్తున్నారు. ట్విట్టర్‌ కూడా ఈ రేసులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ప్రాంతీయ భాషల్లో ఈ మూడు సోషల్‌ మీడియా అప్లికేషన్లు అందుబాటులోకి రావడంతో ఇంగ్లిష్‌ మీద పట్టులేని గ్రామీణ వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ జాబితాలో చేరారు. దీంతో ఈసారి ఎన్నికల ప్రచారం పూర్తిగా ఆన్‌లైన్‌ యుద్ధం పైనే ఆధారపడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటర్లను చేరుకోడానికి భారీ బచహరంగ సభలు, పత్రికలు, టీవీల్లో ప్రకటనలు మాత్రమే మాధ్యమాలుగా ఉ న్నాయి. వాటితో పోల్చి తే అతి తక్కువ ఖర్చుతో, మరింత సజనాత్మకంగా మల్టిమీడియా ఫార్మాట్లలో ప్రచారం చేసుకోడానికి సోషల్‌ మీడియా వేదికగా మారింది. అందుకే ఈసారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సోషల్‌ మీడియాపై దృష్టి పెట్టాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :