ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

APNRT USA ప్రొవిజినల్ కోఆర్డినేటర్ గా సురేంద్ర అబ్బవరం నియామకం

APNRT USA ప్రొవిజినల్ కోఆర్డినేటర్ గా సురేంద్ర అబ్బవరం నియామకం

APNRT (Non-Resident Telugu Society, a Government of Andhra Pradesh) USA ప్రొవిజినల్ కోఆర్డినేటర్ గా, కాలిఫోర్నియా, బే ఏరియా లో నివాసం ఉండే శ్రీ సురేంద్ర అబ్బవరం ను నియమించినట్లు APNRT ఒక ప్రకటనలో తెలిపారు.

ఒక్క సంవత్సరం కాలపరిమితి ఉండే ఈ సమన్వయ కార్యక్రమంలో AP ప్రభుత్వం మరియు  APNRT  Society   చేపట్టే కార్యక్రమాలను విస్తృతంగా  ప్రచారంచేయడం, APNRTS  ద్వారా తెలుగు వారి వికాసానికి  నిర్వయించే అనేక సేవ, సాంసృతిక  కార్యక్రమాలైన, దేవాలయాల దర్శనం, ఇతర న్యాయ, ఇమ్మిగ్రేషన్ సలహా సూచనలు, కుటుంబ ఆరోగ్య బీమా, ప్రయాణ మార్గదర్శకాలు  లాంటి కార్యక్రమాల్లో సహాయపడటం చేస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మరియు పెట్టుబడుల రంగాలలో గల అవకాశాలను అమెరికా వ్యాప్తంగా ఆసక్తి ఉన్న తెలుగు NRI లకు విస్తృతంగా వివరించడం  తద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల వచ్చేవిదంగా కృషి చేయడం ద్వారా  టూరిజం, వాణిజ్యం మరియు టెక్నాలజీ రంగాలలో ఉపాధి కల్పన కల్పించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో NRI లను భాగస్వామ్యం చేయడం కోసం కృషి చేస్తారని తెలిపారు.

ఈ బాధ్యత అప్పగించిన APNRT ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ మేడపాటి గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సురేంద్ర అబ్బవరం కృతఙ్ఞతలు తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :