ఉత్తర ప్రీ రిలీజ్ వేడుక
నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా నటించిన చిత్రం ఉత్తర. తిరుపతి యస్ ఆర్ దర్శకుడు. తిరుపతి యస్ఆర్, శ్రీపతి గంగదాస్ నిర్మించారు. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ సినిమాలో సహజమైన తెలంగాణ మాండలికాన్ని, మనుషులను తెరపై ఆవిష్కరించాం. తెలంగాణలోని సుందరమైన గ్రామీణ లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. మహిళల రక్షణ గురించి చర్చించాం. చక్కటి సందేశంతో సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ సినిమాలో తెలంగాణ పల్లెదనం తెరపై స్వచ్ఛంగా కనిపిస్తుంది. దర్శకుడు తిరుపతి ఎన్నో కష్టాలు పడి సినిమాను పూర్తి చేశాడు అని చిత్ర సమర్పకుడు రవికుమార్ తెలిపారు. వినూత్న కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నిర్మాత శ్రీపతి రంగదాస్ చెప్పారు. రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు మేళవించిన వినూత్న కథాంశంతో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు.