ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు?

కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు?

ఒకవైపు జాతీయ రాజకీయాలను చక్కబెడుతూనే మరోవైపు మంత్రివర్గ కూర్పుపై తెరాస అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలను ప్రారంభించారు. సంక్రాంతి తరువాత తన మంత్రివర్గం ఏర్పడుతుందని చెప్పినప్పటికీ దానికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే కేసీఆర్‌ ప్రారంభించారని చెబుతున్నారు.

రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ నెల 13న రాజ్‌భవన్‌ ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ తనతో పాటు మహమూద్‌ అలీని మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు హోంమంత్రి శాఖను కేటాయిస్తూ అదేరోజు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆనాటి నుంచి మంత్రివర్గ విస్తరణపై ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు కతజ్ఞతలు తెలుపుతూనే మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని అభ్యర్థించిన సంగ తి తెలిసిందే. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి కూడా అమాత్య పదవులు తమకు దక్కేలా చూడాలని కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరినట్టు పార్టీలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

కేసీఆర్‌ కూడా తన మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, ఏఏ సామాజికవర్గాలకు అవకాశం ఇవ్వాలి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయానికి కషి చేసిన వారెవరు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారి పనితీరు ఎలా ఉంది, ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టతకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చేసిన కషి ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని వారినే మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మాజీలైన మంత్రుల్లో తిరిగి ఎవరెవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతుంటే, కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కొందరు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఈదఫా మంత్రివర్గంలో దళితుల్లోని ఇరు సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మహిళను కూడా కొత్తగా విస్తరించే మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న అంశంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. శాసనసభ స్పీకర్‌గా ఉన్న మధుసూదనాచారి ఓడిపోయిన నేపథ్యంలో స్పీకర్‌ పోస్టును బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలా లేక దళితులకు ఇవ్వాలా అనే అంశంపై కేసీఆర్‌ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను ఎంపిక చేశాకే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్నది ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మాజీ మంత్రులు మరోసారి తమ అదష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. నలుగురు మంత్రులు అసెంబ్లి ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, చందూలాల్‌ ఉన్నారు. ఈ నలుగురు సామాజిక వర్గాలకు చెందిన వారిని మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించేందుకు కేసీఆర్‌ వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. క్రితం మంత్రివర్గంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురున్నారు. వీరిలో సీఎం కేసీఆర్‌ ఉండగా, మంత్రులుగా హరీష్‌రావు, కేటీఆర్‌, జూపల్లి కొనసాగారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి (నిజామాబాద్‌), ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి (ఆదిలాబాద్‌), నాయిని నర్సింహారెడ్డి (హైదరాబాద్‌), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్‌), జి.జగదీష్‌రెడ్డి (నల్గొండ) పనిచేశారు. బీసీ వర్గాలకు చెందిన ఈటల రాజేందర్‌ (కరీంనగర్‌), జోగు రామన్న (ఆదిలాబాద్‌), తలసాని శ్రీనివాస యాదవ్‌ (హైదరాబాద్‌), పద్మారావు గౌడ్‌ (హైదరాబాద్‌) పనిచేయగా, వీరిలో ఒకరు ముదిరాజ్‌, మరొకరు మున్నూరుకాపు, మూడవ వారు యాదవ, సికింద్రాబాద్‌కు చెందిన పద్మారావు గౌడ సామాజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. దళితుల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనసాగారు. మైనారిటీ నుంచి గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ఈ మంత్రివర్గంలో హోంమంత్రిగా మహమూద్‌ అలీకి అవకాశం దక్కింది. ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో మరో 14 మందిని తీసుకునే అవకాశం ఉండగా గతంలోలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి నాలుగు లేక ఐదు మంత్రి పదవులు, బీసీలకు ఐదు నుంచి ఆరు మంది, మహిళకు, దళితుల్లో మాల, మాదిగ సామాజికవర్గాలకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :