Radha Spaces ASBL

బెరం పార్కులో అఖిలభారత సర్వీసు అధికారుల 2018 ఏడాదికి వీడ్కోలు

బెరం పార్కులో అఖిలభారత సర్వీసు అధికారుల 2018 ఏడాదికి వీడ్కోలు

2019 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అధికారులను పలు రకాల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న కళాకారులు. నూతన సంవత్సర వేడుకలకు భార్యాపిల్లలతో హాజరైన అఖిల భారత సర్వీసు అధికారులు.

బేరం పార్కులో అఖిల భారత్ సర్వీసు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ``ఐఏఎస్ అధికారులు 2018 ఏడాదికి వేడ్కోలు పలికి 2019 నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధపడటం సంతోషదాయకం. గతంలో ఒక్క ఐఏఎస్ మాత్రమె ఈ వేడుకలకు హాజరయ్యేవారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త వరవడికి నాంది పలకడం ఆహ్వానించదగింది. ఐఏఎస్ లతోపాటు ఐపీఎస్ , ఇతర అఖిలభారత సర్వీసు అధికారులందరూ కలసి నూతనసంవత్సర వేడుకలకు హాజరవడం అభినందనీయం. విధుల నిర్వహణలో, బాధ్యతలతో బిజీగా గడపడంలో అధికారులకు కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. కొత్తరాష్ట్రం అనేక సమస్యల మధ్య పాలనను గాడిలో పెట్టడంలో అధికారుల పాత్ర ప్రశంసనీయం. రాష్ట్ర ఉన్నతాధికారుల ప్రతిభ, సమర్థతతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడం సాధ్యమవుతోందని అభినందించారు. 2019 అద్భుత సంవత్సరంగా మనందరికీ ఆనందమయ జీవితాలను ఇస్తుందని ఆకాంక్షిస్తున్నానన్నారు. గతంలో హైదరబాద్ లో చెప్పుకోదగ్గ అవకాశాలులేవన్నారు. అవుటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్టు, ఐటీ పరిశ్రమ నిలదొక్కుకోవడం తదితర అభివృద్ధి పనులతో ఎకో సిస్టం ను ఏర్పాటు చేశామన్నారు, అంతకుమించి అమరావతిని అభివృద్ధి పరచుకుని ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దుదామని సూచించారు. అమరావతిలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు వైద్యశాలలు, వినోద విజ్ఞాన కేంద్రాలతో అలరారనుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అమరావతిలో స్థిరనివాసం ఏర్పరుచు కోవాలని స్థిరనిశ్చయానికి వస్తారన్నారు. ఒకపక్క కృష్ణానది పవిత్ర జలం, మరోపక్క సస్యశ్యామలమైన భూములతో ఆంధ్రప్రదేశ్ ఎందరినో ఆకర్షిస్తుందనడంలో సందేశం లేదన్నారు.

అంతకుముందు బెరంపార్కులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటా, డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్వాగతం పలికారు. అక్కడ హాజరైన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్దిసేపు మాట్లాడారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :