ఎక్కువగా వాడని పాత్రలు, పాత డబ్బాలు, ఖాళీ బాటిళ్లను తొలగిస్తే కిచెన్‌లో ఖాళీ స్థలం పెరుగుతుంది.
ముందుగా అవసరం లేని వస్తువులు తొలగించండి
గోడలకు ర్యాక్స్, హ్యాంగింగ్ షెల్ఫ్స్ ఏర్పాటు చేస్తే కౌంటర్ స్పేస్ ఆదా అవుతుంది. చిన్న కిచెన్ మరింత విశాలంగా కనిపిస్తుంది.
వర్టికల్ స్టోరేజ్ ఉపయోగించండి
వంట, కూరగాయలు కట్ చేయడం, సర్వింగ్, క్లీనింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేస్తే పనులు వేగంగా పూర్తవుతాయి.
కిచెన్‌ను జోన్స్‌గా విభజించండి
రోజూ ఉపయోగించే మసాలా డబ్బాలు, నూనె, వంట సామగ్రిని స్టౌవ్ దగ్గర ఉంచితే వంట సమయం తగ్గుతుంది.
మసాలాలకు ప్రత్యేక స్థానం ఇవ్వండి
ఒకే సైజు పారదర్శక డబ్బాల్లో పప్పులు, ధాన్యాలు నిల్వ చేస్తే స్థలం ఆదా అవుతుంది. వస్తువులు సులభంగా కనిపిస్తాయి.
స్టాక్ చేయగల కంటైనర్లు వాడండి
షెల్ఫ్ రైజర్లు, డ్రాయర్ డివైడర్లు, హుక్స్ ఉపయోగించి చిన్న చిన్న వస్తువులకు సరైన స్థానం కల్పించండి.
కేబినెట్ లోపలి స్థలాన్ని ఉపయోగించండి
కార్నర్ ర్యాక్స్, రొటేటింగ్ స్టోరేజ్ సొల్యూషన్స్‌తో సాధారణంగా ఉపయోగించని మూలలను కూడా ఉపయోగించుకోవచ్చు.
మూలల స్థలాన్ని వృథా చేయొద్దు
ప్రతిరోజూ అవసరమైన వస్తువులు మాత్రమే బయట ఉంచి మిగతావి క్యాబినెట్‌లో పెట్టడం వల్ల కిచెన్ క్లీన్‌గా కనిపిస్తుంది.
కౌంటర్‌పై తక్కువ వస్తువులు ఉంచండి