బ్రైడల్ గ్లో కోసం చివరి నిమిషంలో కాకుండా 3–6 నెలల ముందే చర్మ సంరక్షణ ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
3–6 నెలల ముందే స్కిన్‌కేర్ ప్రారంభించండి
ఉదయం, రాత్రి సున్నితమైన ఫేస్‌వాష్‌తో ముఖం శుభ్రం చేసి, చర్మ రకానికి సరిపోయే మాయిశ్చరైజర్ వాడితే చర్మం తాజాగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ తప్పనిసరి
SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల ట్యానింగ్, పిగ్మెంటేషన్‌ను తగ్గించుకోవచ్చు.
సన్‌స్క్రీన్‌ను ఎప్పుడూ మర్చిపోవద్దు
రోజంతా తగినంత నీరు తాగండి. పండ్లు, ఆకుకూరలు, నట్స్, ప్రోటీన్ ఆహారం తీసుకుంటే చర్మం లోపల నుంచే ఆరోగ్యంగా మెరుస్తుంది.
నీరు, పోషకాహారం గ్లోకు రహస్యం
రోజూ 7–8 గంటలు నిద్రపోవడం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ముఖంపై సహజమైన కాంతి కనిపిస్తుంది.
నిద్ర, ఒత్తిడి నియంత్రణకు ప్రాధాన్యం
జుట్టుకు క్రమం తప్పకుండా ఆయిల్ మసాజ్ చేయండి. హీట్ స్టైలింగ్ తగ్గించి, పోషకాహారం తీసుకుంటే పెళ్లి రోజున హెయిర్ కూడా అందంగా కనిపిస్తుంది.
హెయిర్ కేర్‌ను కూడా విస్మరించొద్దు
పెళ్లికి ముందు కొత్త స్కిన్‌కేర్ ఉత్పత్తులు లేదా ట్రీట్‌మెంట్స్ ప్రయత్నించకండి. అలెర్జీలు, బ్రేకౌట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్‌తో ప్రయోగాలు చేయొద్దు
వారానికి ఒకసారి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ లేదా చర్మానికి సరిపోయే ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం మరింత ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
వారానికి ఒకసారి స్కిన్ ప్యాంపరింగ్