ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 10 వేల అడుగులు నడవాల్సిందేనా? అంతకంటే తక్కువ నడిచినా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అసలు ఎన్ని అడుగులు సరిపోతాయి?
ఈ 10,000 అడుగుల సంఖ్య వైద్య పరిశోధనల ద్వారా రాలేదు. 1964 టోక్యో ఒలింపిక్స్ సమయంలో జపాన్లో పెడోమీటర్ ప్రచారంతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది.
10,000 అడుగుల లెక్క వెనుక కథ
2025లో 'ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్' అధ్యయనం ప్రకారం, రోజుకు సుమారు 7,000 అడుగులు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఆరోగ్యాకి 7,000 అడుగులు చాలు!
రోజుకు 7,000 అడుగులు నడవడం ద్వారా 47% అకాల మరణ ముప్పు, 25% గుండె జబ్బుల ముప్పు మరియు 14% మధుమేహ ముప్పు తగ్గుతుంది.
ముప్పు ఎంత తగ్గవచ్చు?
ఒక్కసారిగా 7 వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకోవాల్సిన పనిలేదు. రోజూ కొద్దిగా మొదలుపెట్టి, మెల్లిమెల్లిగా అడుగుల సంఖ్యను పెంచుకోవడం మంచిది.
కొద్దిగా నడకతోనే మొదలు పెట్టండి
కాదు! 7,000 అడుగుల తర్వాత అదనంగా నడవడం వల్ల కూడా ప్రయోజనాలు కొనసాగుతాయి. కాకపోతే ఒక దశ తర్వాత అదనపు లాభం కొంత తగ్గుతుంది.
అదనపు అడుగులు వృథానా?
కేవలం అడగులే కాకుండా, నడక వేగం కూడా ముఖ్యం. శ్వాస కొద్దిగా వేగంగా మారేలా, ఎదుటివారితో మాట్లాడగలిగేంత వేగంతో నడవడం మంచిది.
అడుగుల కంటే వేగమూ ముఖ్యమే!
నిమిషానికి 100 అడుగులు అనేది చురుకైన నడకను అంచనా వేయడానికి ఒక సాధారణ సూచిక. అయితే ఇది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి వేగం కాదు.
చురుకైన నడక సూచిక
ఫోన్లో మాట్లాడేటప్పుడు నడవడం, దగ్గరి దుకాణాలకు నడిచి వెళ్లడం, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మధ్యలో లేచి కదలడం వంటి చిన్న మార్పులు చేయండి.
నడకకు సమయం లేదా? ఇలా చేయండి!
రోజుకు 7,000 అడుగులు ఒక మంచి లక్ష్యం. అంతకంటే తక్కువతో ప్రారంభించినా పర్వాలేదు. మీ శరీర సామర్థ్యానికి తగ్గట్టుగా నడకను సాగించండి!