వరసగా సినీ, క్రీడా ప్రముఖుల జీవిత కథలు వెండితెరపైకి వస్తున్నాయి. రీసెంట్ గా ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ కూడా మొదలైంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో మరో దిగ్గజ గాయని కథపై చర్చ మొదలైంది.
బయోపిక్‌ల హవా..మరో సింగర్ జీవిత కథ
తెలుగు సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల మనసుల్లో నిలిచిపోయిన పి. సుశీల జీవిత కథను సినిమాగా తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ దిగ్గజ గాయని ఎవరో తెలుసా?
ఈ బయోపిక్‌లో రుక్మిణి వసంత్ నటించనున్నట్లు సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ఆమె ఎంపికపై అధికారిక ప్రకటన రాలేదు.
సుశీల పాత్రలో రుక్మిణి వసంత్?
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మద్దతు ఉన్నట్లు సమాచారం. ఆయన నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. దాంతో ఈ బయోపిక్ పై ప్రకటన కూడా రాకుండానే ఆసక్తి మొదలైంది.
ప్రాజెక్టు వెనుక ఆస్కార్ విజేత?
2021లోనే పి. సుశీల బయోపిక్ గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడారు. అప్పట్లో ఆయన వెల్లడించిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది.
ఈ కథ ఇప్పటిది కాదు!
రెహమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, 99 Songs తెలుగు వెర్షన్ చూసిన సుశీల తన జీవిత కథను కూడా సినిమాగా రూపొందించాలని కోరారు.
రెహమాన్‌ను సుశీల ఏం కోరారు?
పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన సుశీల సంగీత ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. ఆమె జీవితంలోని కీలక ఘట్టాలు బయోపిక్‌లో ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం.
వేల పాటలు..అజరామరమైన గానం!
రుక్మిణి వసంత్ ఎంపిక, ఏఆర్ రెహమాన్ నిర్మాణ బాధ్యతలు ఖరారు చేస్తూ అతి త్వరలో అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాబోతోందని వినికిడి.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు!