22nd October 2026

_________

- Bhuvana

10 నిమిషాల్లో కొత్తిమీర రైస్ చేసే విధానం.. 

 కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, ఉడికించిన అన్నం, జీలకర్ర, నెయ్యి లేదా నూనె, ఉప్పు ఉంటే ఈ రెసిపీ సులభంగా తయారవుతుంది.

కావాల్సిన పదార్థాలు 

కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా పుదీనా వేసి మెత్తని పేస్ట్ చేయండి. ఈ పేస్టే రైస్‌కు ప్రత్యేక రుచి, సువాసన ఇస్తుంది.

 కొత్తిమీర పేస్ట్ తయారు చేయండి**

పాన్‌లో నెయ్యి లేదా నూనె వేడి చేసి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించండి. దీంతో అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది.

తాలింపు వేయండి

తాలింపులో కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. నూనె పైకి కనిపించే వరకు ఉడికిస్తే రుచి మరింత పెరుగుతుంది.

పేస్ట్‌ను బాగా వేయించండి

ముందుగా ఉడికించి చల్లార్చిన అన్నాన్ని పేస్ట్‌లో వేసి మెత్తగా కలపండి. మెతుకులు విడివిడిగా ఉంటే రైస్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అన్నం కలపండి

జీడిపప్పు లేదా వేరుశెనగలను స్వల్పంగా వేయించి కలిపితే కరకరలాడే టెక్స్చర్‌తో పాటు రుచి కూడా రెట్టింపవుతుంది.

రుచిని పెంచే చిట్కా

కొత్తిమీర రైస్‌ను రైతా, పెరుగు, చిప్స్ లేదా పాపడ్‌తో సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. లంచ్ బాక్స్‌కూ ఇది మంచి ఎంపిక.