15th October 2026

_________

- Bhuvana

తెలుగు సినిమా దర్శకుడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?

'కమిట్‌మెంట్' ఇవ్వాలంటూ ఓ దర్శకుడు వేధించారని హీరోయిన్ నీతి టేలర్ ఆరోపణలు చేసారు..ఆ తెలుగు దర్శకుడు ఎవరు?

నెక్ట్స్  సినిమా అవకాశం కోసం ఫోన్ చేసిన ఓ దర్శకుడు.. ఊహించని ప్రతిపాదన చేశాడు! అప్పటినుంచే దక్షిణాది సినిమాలకే దూరమయ్యానని అంటోంది.

ఒక ఫోన్ కాల్..సినిమాలకు దూరం!

నీతి టేలర్ తెలుగులో మేం వయసుకు వచ్చాం, లవ్ డాట్ కామ్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో కనిపించలేదు. దాంతో ఏ దర్శకుడు అనే ప్రశ్న మొదలైంది.

తెలుగులో రెండు సినిమాలు

నెక్ట్స్  సినిమాలో అవకాశం కావాలంటే తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని దర్శకుడు కోరినట్లు నీతి టేలర్ ఆరోపించారు.

షాక్‌కు గురిచేసిన ప్రపోజల్

ఆ మాటలు విన్న వెంటనే ఫోన్ కట్ చేసి, అతడి నంబర్‌ను బ్లాక్ చేశానని ఆమె తెలిపారు. ఆ తర్వాత తల్లికి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పారు.

వెంటనే బ్లాక్ చేశా!

నీతి టేలర్ తొలి తెలుగు చిత్రం *మేం వయసుకు వచ్చాం*కు త్రినాథరావు నక్కిన దర్శకుడు. దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు ప్రస్తావనకు వస్తోంది.

త్రినాథరావు నక్కిన పేరుపై చర్చ

కీలకమైన విషయం ఏమిటంటే.. నీతి టేలర్ తనను వేధించిన దర్శకుడి పేరును వెల్లడించలేదు. ఆ ఆరోపణలను త్రినాథరావు నక్కినకు ఆపాదించడానికి నిర్ధారిత ఆధారాలు లేవు.

అయితే ఆమె పేరు చెప్పలేదు!

తన ఫోన్ నంబర్‌ను బహిరంగ ప్రదేశాల్లో రాయడంతో అసభ్యకరమైన కాల్స్ వచ్చేవని నీతి తెలిపారు. ఆ వేధింపులతో స్కూల్ బస్సులో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.

స్కూల్ రోజుల నుంచే వేధింపులు

తన మాజీ ప్రియుడు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, శారీరకంగా హింసించాడని నీతి వెల్లడించారు. సిగరెట్లతో కాల్చిన మచ్చలు ఇప్పటికీ ఉన్నాయని ఆరోపించారు.

మాజీ ప్రియుడిపైనా ఆరోపణలు

కైసీ యే యారియాన్ సీరియల్‌తో నీతి టేలర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ఇష్క్‌బాజ్, బడే అచ్ఛే లగ్తే హై 2లోనూ నటించారు.

టీవీతో స్టార్‌డమ్

సినిమా అవకాశాల పేరుతో మహిళలు ఎదుర్కొనే వేధింపులపై నీతి టేలర్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.

మళ్లీ చర్చలోకి క్యాస్టింగ్ కౌచ్