13th October 2026

_________

- Bhuvana

డైనింగ్ టేబుల్‌కు కొత్త లుక్ ఇచ్చే DIY టేబుల్ రన్నర్ ఐడియాస్!

ఇంట్లో ఉపయోగించని దుపట్టాను సరైన సైజులో కట్ చేసి అంచులకు లేస్ లేదా టాసెల్స్ జోడిస్తే తక్కువ ఖర్చుతో అందమైన టేబుల్ రన్నర్ సిద్ధమవుతుంది.

 పాత దుపట్టాతో టేబుల్ రన్నర్

జూట్ క్లాత్‌తో తయారు చేసిన టేబుల్ రన్నర్ డైనింగ్ స్పేస్‌కు నేచురల్ లుక్ ఇస్తుంది. మొక్కలు, చెక్క డెకర్‌తో కలిపితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

జూట్ ఫ్యాబ్రిక్ రస్టిక్ స్టైల్

బ్లాక్ ప్రింట్ లేదా హ్యాండ్ ప్రింటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన టేబుల్ రన్నర్ సంప్రదాయం, ఆధునికత రెండింటినీ కలిపిన అందాన్ని ఇస్తుంది. 

బ్లాక్ ప్రింట్ ఫ్యాబ్రిక్ డిజైన్స్

చేతితో అల్లిన క్రోషే టేబుల్ రన్నర్స్ 2026లో హోమ్ డెకర్‌లో ట్రెండింగ్. ఇవి ఇంటికి హ్యాండ్‌మేడ్, ప్రీమియం ఫీలింగ్‌ను అందిస్తాయి. 

క్రోషే టేబుల్ రన్నర్ ట్రెండ్

మిగిలిపోయిన రంగురంగుల క్లాత్ ముక్కలను కలిపి ప్యాచ్‌వర్క్ టేబుల్ రన్నర్ తయారు చేస్తే యూనిక్ డిజైన్‌తో పాటు ఫ్యాబ్రిక్ వృథా కూడా తగ్గుతుంది.

ప్యాచ్‌వర్క్ రన్నర్ ఐడియా

మ్యాక్రమే నాట్స్, టాసెల్స్‌తో తయారైన టేబుల్ రన్నర్స్ బోహో ఇంటీరియర్‌కు పర్ఫెక్ట్. ఇవి టేబుల్‌ను వెంటనే ఆకర్షణీయంగా మారుస్తాయి.

బోహో స్టైల్ మ్యాక్రమే రన్నర్

దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగలకు తగ్గ రంగులు, ప్రింట్లతో ప్రత్యేక టేబుల్ రన్నర్స్ తయారు చేస్తే ఇంటి అలంకరణ మరింత అందంగా ఉంటుంది.

సీజనల్ DIY టేబుల్ రన్నర్స్

టేబుల్ రన్నర్‌పై చిన్న పూలదాని, కొవ్వొత్తులు లేదా చెక్క ట్రే ఉంచితే డైనింగ్ టేబుల్ మరింత ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

సెంటర్‌పీస్‌తో స్టైలింగ్