12th October 2026

_________

- Bhuvana

చెప్పులు కూడా స్టైల్‌గా.. ఇంటికి అందాన్ని పెంచే షూ ర్యాక్ డిజైన్స్

ఇంటి ప్రవేశం దగ్గర చెప్పులు చిందరవందరగా ఉంటే లుక్ తగ్గుతుంది. స్టైలిష్ షూ ర్యాక్‌తో అందం, క్రమబద్ధత రెండూ పొందవచ్చు.

షూ ర్యాక్‌తో ఇంటికి కొత్త లుక్

సహజమైన చెక్కతో చేసిన షూ ర్యాక్స్ ఇంటికి వెచ్చని, క్లాసీ లుక్ ఇస్తాయి. వుడ్ ఫినిష్ ఇంటీరియర్‌తో ఇవి అందంగా కలిసిపోతాయి.

వుడెన్ షూ ర్యాక్ డిజైన్స్

కూర్చొని చెప్పులు వేసుకునే సౌకర్యంతో వచ్చే షూ కమ్ సీటింగ్ ర్యాక్స్ చిన్న ఇళ్లకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. 

షూ కమ్ సీటింగ్ ర్యాక్

డోర్లు ఉన్న షూ క్యాబినెట్స్ చెప్పులను కనిపించకుండా ఉంచుతాయి. ఇంటి ఎంట్రన్స్ ఎప్పుడూ నీట్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

హిడెన్ స్టోరేజ్ షూ క్యాబినెట్స్

నేల స్థలం తక్కువగా ఉన్న ఇళ్లకు వాల్ మౌంటెడ్ షూ ర్యాక్స్ మంచి ఎంపిక. ఇవి స్పేస్ ఆదా చేస్తూ మోడ్రన్ లుక్ ఇస్తాయి. 

వాల్ మౌంటెడ్ షూ ర్యాక్స్

షూ ర్యాక్ పైన అద్దం ఏర్పాటు చేస్తే ఎంట్రన్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బయటకు వెళ్లే ముందు చివరి లుక్ చెక్ చేసుకోవచ్చు. 

మిర్రర్‌తో షూ ర్యాక్ కాంబినేషన్

రోజూ ఉపయోగించే చెప్పులకు ఓపెన్ షెల్ఫ్ డిజైన్లు సౌకర్యంగా ఉంటాయి. సింపుల్ డిజైన్‌తో ఇంటికి మినిమల్ లుక్ అందిస్తాయి.

ఓపెన్ షెల్ఫ్ షూ ర్యాక్స్