12th October 2026

_________

- Bhuvana

పట్టు చీరతో ఈ జ్యువెలరీ వేసుకుంటే అందరి చూపు మీవైపే

లక్ష్మీ దేవి, నెమలి, పూల డిజైన్లతో ఉండే టెంపుల్ జ్యువెలరీ పట్టు చీరలకు అద్భుతంగా సరిపోతుంది. పెళ్లిళ్లు, పండుగలకు ఇది బెస్ట్ ఛాయిస్.

టెంపుల్ జ్యువెలరీతో రాయల్ లుక్

పట్టు చీరపై పొడవైన హారం, చోకర్ లేదా లేయర్డ్ గోల్డ్ నెక్లెస్ వేసుకుంటే సంప్రదాయ రాయల్ లుక్ వస్తుంది. చీర జరీకి సరిపోయే డిజైన్ ఎంచుకోండి.

హెవీ గోల్డ్ నెక్లెస్ అందం

పెద్ద జుమ్కాలు లేదా టెంపుల్ డిజైన్ చెవిపోగులు పట్టు చీర అందాన్ని రెట్టింపు చేస్తాయి. జడ, పూల అలంకరణతో కలిపితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

జుమ్కాలతో సంపూర్ణమైన లుక్

కుందన్ స్టోన్స్‌తో రూపొందించిన నెక్లెస్‌లు, చెవిపోగులు పట్టు చీరలకు ఫ్యాన్సీ టచ్ ఇస్తాయి. పెళ్లి వేడుకలు, రిసెప్షన్లకు ఇవి చక్కటి ఎంపిక.

కుందన్ జ్యువెలరీ ట్రెండ్

తెల్లని ముత్యాలతో ఉండే జ్యువెలరీ పట్టు చీరకు సాఫ్ట్, క్లాసీ లుక్ ఇస్తుంది. లైట్ కలర్ సిల్క్ చీరలకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ముత్యాల ఆభరణాలతో ఎలిగెంట్ లుక్

పట్టు చీర లుక్‌ను పూర్తి చేయాలంటే గాజులు, నడుము వడ్డానం వంటి ఆభరణాలు కూడా ముఖ్యమే. ఇవి సంప్రదాయ అందాన్ని మరింత పెంచుతాయి.

గాజులు, వడ్డానం మర్చిపోవద్దు

హెవీ చీరకు ఎక్కువ ఆభరణాలు కాకుండా ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా పెద్ద చెవిపోగులు ఎంచుకుంటే ట్రెండీ, ఎలిగెంట్ లుక్ వస్తుంది.

మినిమల్ జ్యువెలరీతో మోడ్రన్ లుక్