8th October 2026

_________

- Bhuvana

మేకప్ లేకుండా అందంగా కనిపించేందుకు సింపుల్ టిప్స్

ఉదయం, రాత్రి మైల్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేస్తే దుమ్ము, ఆయిల్ తొలగి చర్మం తాజాగా కనిపిస్తుంది. గట్టిగా రుద్దకండి.

రోజుకు రెండుసార్లు ముఖం శుభ్రం చేయండి

చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్ వాడితే తేమ నిలిచి స్కిన్ మృదువుగా, సహజ కాంతితో కనిపిస్తుంది. పొడి చర్మానికి ఇది చాలా ముఖ్యం.

మాయిశ్చరైజర్‌ను మిస్ అవ్వొద్దు

ఇంటి బయటకు వెళ్లే ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్ వాడటం వల్ల ట్యాన్, పిగ్మెంటేషన్, ముందస్తు వృద్ధాప్య లక్షణాలను తగ్గించవచ్చు. 

సన్‌స్క్రీన్ మీ బెస్ట్ ఫ్రెండ్

తగినంత నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా కనిపించి సహజ గ్లో పెరుగుతుంది.

నీరు ఎక్కువగా తాగండి

ప్రతిరోజూ 7–9 గంటల నిద్ర చర్మం రిపేర్ కావడానికి సహాయపడుతుంది. దీంతో ముఖం తాజాగా, అలసట లేకుండా కనిపిస్తుంది. 

సరిపడా నిద్ర తప్పనిసరి

శుభ్రంగా షేప్ చేసిన కనుబొమ్మలు, తేమగా ఉండే పెదవులు మేకప్ లేకుండానే ముఖానికి ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తాయి.

కనుబొమ్మలు, పెదవుల సంరక్షణ