2nd October 2026

_________

- Bhuvana

సాయంత్రం ఆకలి వేస్తే ఇవి తినండి.. టేస్టీగా, హెల్తీగా!

సాయంత్రం నాలుగు గంటలు అయిందంటే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. చెత్త తిళ్లకు బదులుగా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏంటో చూద్దాం!

అటుకులను కొద్దిగా నూనెలో వేయించి, పల్లీలు, కరివేపాకు, పుట్నాలు వేసి చేసుకునే అటుకుల మిక్చర్ తేలికగా అరిగిపోతుంది.

అటుకుల మిక్చర్

పెసలు, శెనగలు మొలకెత్తించి అందులో ఉల్లిపాయ, టమాటా, నిమ్మరసం కలిపి తింటే విటమిన్లు, మీకు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.

మొలకెత్తిన గింజల చాట్

తామర గింజలను నెయ్యిలో కొద్దిగా వేయించి ఉప్పు, మిరియాల పొడి చల్లుకుంటే ఇవి కరకరలాడుతూ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

మఖానా

కార్న్ (మొక్కజొన్న) ఉడకబెట్టి దానిపై నిమ్మరసం, ఉప్పు, కారం రాసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉడికించిన మొక్కజొన్న పొత్తు

వేయించిన పుట్నాల పప్పు లేదా పొట్టు తీయని శెనగలు గుప్పెడు తింటే తక్షణ శక్తి అందడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

వేయించిన శెనగలు

అరటిపండు, బొప్పాయి, ఆపిల్ లేదా దానిమ్మ గింజలను చిన్న ముక్కలుగా కోసి చాట్ మసాలా చల్లుకుంటే అద్భుతమైన ఈవెనింగ్ స్నాక్ రెడీ!

ఫ్రూట్ చాట్

కొద్దిగా ఓట్స్‌‌ను కూరగాయలతో కలిపి తక్కువ నూనెతో చేసుకుంటే రుచికరంగా ఉండటమే కాకుండా ఫైబర్ ఎక్కువుగా అందుతుంది.

ఓట్స్ ఉప్మా లేదా పోరిడ్జ్

బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ గుప్పెడు తింటే మెదడు చురుగ్గా మారుతుంది మరియు ఆకలి అదుపులో ఉంటుంది.

బాదం మరియు వాల్‌నట్స్

సాయంత్రం వేళల్లో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ఇలాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తిని ఫిట్‌గా మరియు ఉత్సాహంగా ఉండండి!