29th September 2026

_________

- Bhuvana

కిచెన్‌లో ఉన్న వాటితోనే మొక్కలు పెంచండి.. విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు!

ఉల్లిపాయ కింది భాగాన్ని వృథా చేయకుండా నీటిలో ఉంచితే కొత్త వేర్లు వస్తాయి. తర్వాత మట్టిలో నాటి పెంచండి.

ఉల్లిపాయలతో కొత్త మొక్కలు

మొలకలు వచ్చిన అల్లం ముక్కలను కుండీలో నాటితే కొత్త అల్లం మొక్క పెరుగుతుంది. తేమగా ఉంచడం ముఖ్యం.

అల్లంతో ఇంటి తోట

వెల్లుల్లి రెబ్బలను మట్టిలో నాటితే ఆకులు వస్తాయి. వీటిని వంటల్లో తాజా ఆకులుగా ఉపయోగించవచ్చు.

వెల్లుల్లి రెబ్బలతో పచ్చని మొక్క

కొత్తిమీర కాడలను నీటిలో ఉంచి వేర్లు వచ్చిన తర్వాత మట్టిలో నాటితే తాజా ఆకులు పొందవచ్చు.

కొత్తిమీర మళ్లీ పెంచే విధానం

ఎండిన మిరపకాయల్లోని విత్తనాలను సేకరించి కుండీలో నాటితే ఇంట్లోనే మిరప మొక్క పెంచుకోవచ్చు.

మిరపకాయ విత్తనాలతో మొక్క

పండిన టమాటా నుంచి తీసిన విత్తనాలను ఆరబెట్టి నాటితే చిన్న కిచెన్ గార్డెన్‌లో టమాటాలు పండుతాయి.

టమాటా విత్తనాలతో గార్డెన్

పుదీనా కాడలు, స్ప్రింగ్ ఆనియన్, అజ్వైన్ వంటి వాటిని సరైన పద్ధతిలో పెంచి తాజా పంట పొందవచ్చు.

అద్భుతమైన కిచెన్ స్క్రాప్స్