పట్టుచీరల అందాన్ని మరింత పెంచి, రాయల్ లుక్‌ను అందించే అద్భుతమైన వడ్డాణం డిజైన్లను ఇప్పుడు చూద్దాం!
దేవతల శిల్పాలు, లక్ష్మీదేవి రూపాలతో ఉండే ఈ టెంపుల్ డిజైన్ వడ్డాణం సాంప్రదాయ పట్టుచీరలపై అద్భుతంగా కనిపిస్తుంది.
టెంపుల్ జ్యువెల్లరీ వడ్డాణం
బంగారు తీగలతో కూడి, కింద వైపు వేలాడే ముత్యాల వరుసలు కలిగిన ఈ మహారాణి వడ్డాణం పెళ్లికూతుళ్లకు పర్ఫెక్ట్ ఛాయిస్.
మహారాణి ముత్యాల వడ్డాణం
ఎరుపు రంగు కెంపులు, పచ్చని పచ్చలతో పొదిగిన వడ్డాణం పట్టుచీర రంగును మరింత హైలైట్ చేసి ప్రత్యేక ఆకర్షణ తెస్తుంది.
కెంపులు, పచ్చల హంగులు
సున్నితమైన పూలు మరియు తీగల నమూనాతో రూపొందించిన ఈ డిజైన్ సింపుల్ పట్టుచీరలకు కూడా ఎంతో ట్రెండీ లుక్‌ను ఇస్తుంది.
ఫ్లోరల్ డిజైన్ వడ్డాణం
పురాతన నగలను తలపించే ఆంటిక్ గోల్డ్ వడ్డాణం రాయల్ అండ్ క్లాసిక్ లుక్‌ను కోరుకునే మహిళలకు అత్యంత ఇష్టమైన ఎంపిక.
అంటిక్ ఫినిష్ వడ్డాణం
ఎక్కువ బరువు లేకుండా సులభంగా పెట్టుకునేలా సన్నని గొలుసుల రూపంలో వచ్చే ఈ లైట్‌వెైట్ వడ్డాణం పండుగలకు బాగుంటుంది.
తేలికపాటి బెల్ట్ డిజైన్
పెద్ద సైజు లక్ష్మీ లాకెట్ మధ్యలో వచ్చి, చుట్టూ అందమైన జడ బిళ్లల డిజైన్‌తో కూడిన వడ్డాణం అంతులేని అందాన్నిస్తుంది.
నడుముకు అందమైన హారం
మెరిసే అమెరికన్ డైమండ్స్ లేదా స్పష్టమైన స్టోన్స్‌తో చేసిన వడ్డాణం మోడ్రన్ ఫ్యాన్సీ పట్టుచీరలకు చక్కగా సరిపోతుంది.
డైమండ్ లుక్ వడ్డాణం
పట్టుచీర కట్టుకున్నప్పుడు నడుము వద్ద ఈ అందమైన వడ్డాణాన్ని ధరిస్తే మీ సాంప్రదాయ రూపానికి పరిపూర్ణమైన అందం వస్తుంది!
సంప్రదాయానికి పరిపూర్ణత