పండిన అరటిపండు గుజ్జులో చెంచా తేనె కలిపి తలకు పట్టించి 20 నిమిషాలు ఉంచితే పొడిబారిన జుట్టు మృదువుగా మారుతుంది.
అరటిపండు - తేనె హెయిర్ మాస్క్
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి రాస్తే జుట్టుకు కావలసిన ప్రొటీన్ అంది, సిల్కీ షైన్ వస్తుంది.
గుడ్డు - ఆలివ్ ఆయిల్ మాస్క్
అరకప్పు పెరుగులో రెండు స్పూన్ల కలబంద జెల్ కలిపి తలకు రాసుకుంటే కుదుళ్లు తేమను సంతరించుకుని ప్రకాశిస్తాయి.
పెరుగు - కలబంద జెల్ మాస్క్
కొద్దిగా వేడిచేసిన కొబ్బరి నూనె, తేనె మిశ్రమాన్ని జుట్టు చివర్ల నుండి కుదుళ్ల వరకు రాసి మర్దన చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనె - తేనె మాస్క్
రాత్రి నానబెట్టిన మెంతులను మెత్తగా రుబ్బి, అందులో పెరుగు కలిపి మాస్క్ లా వేసుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మారుతుంది.
మెంతులు - పెరుగు మాస్క్
ఉసిరి పొడిలో కొద్దిగా నిమ్మరసం, నీళ్లు కలిపి తలకు పట్టించి ఆరనిస్తే జుట్టు కుదుళ్లు బలపడి నిగనిగలాడతాయి.
ఉసిరి పొడి - నిమ్మరసం మాస్క్
అవిసె గింజలను ఉడికించి తీసిన జెల్‌ను జుట్టుకు రాసుకుంటే కెరాటిన్ ట్రీట్మెంట్ లాంటి మృదువైన సిల్కీ నిగారింపు వస్తుంది.
అవిసె గింజల జెల్ మాస్క్