17th Sept 2026

_________

- Bhuvana

పింక్ షేడ్స్‌లో అదిరిపోయే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

ట్రెడిషనల్ వేర్ లేదా పెళ్లిళ్లలో ప్రత్యేకంగా మెరవాలంటే సరైన జువెల్రీ ఉండాల్సిందే. ఈ రోజుల్లో గులాబీ (పింక్) షేడ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

కమలం నగిషీ, మీనాకారీ ప్లాన్, కింద వేలాడే ముత్యాల కాంబినేషన్ ఈ ఇయర్ రింగ్స్ కి రాయల్ లుక్ ఇస్తుంది. పట్టు చీరలకు ఇవి ఎంతో బాగుంటాయి.

లోటస్ చాంద్ బాటీ జుమ్కా

చంద్రవంక ఆకారంలో మెరిసే రాళ్లు, మృదువైన పింక్ ముత్యాల ముగింపుతో రూపొందించిన ఈ డిజైన్ లంగా ఓణీలు, లెహంగాలకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

పేస్టల్ పింక్ చాంద్ బాలీలు 

కుందన్ రాళ్లు, జుమ్కాలతో ఉన్న ఈ హెవీ షాండ్లియర్ చెవిపోగులు గ్రాండ్ లుక్ ఇస్తాయి. రిసెప్షన్ లేదా సంగీత్ ఈవెంట్స్ కి ఇవి చాలా బాగుంటాయి.

హెవీ కుందన్ షాండ్లియర్ జుమ్కా

కమలం మోటిఫ్ కింద పొడవైన ముత్యాలు, రాళ్ల గొలుసులు వేలాడుతూ ఉంటాయి. ఇవి మీ ముఖానికి ప్రత్యేక కళను తెచ్చిపెట్టి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి.

కమలం చైన్ లాంగ్ ఇయర్ రింగ్స్

పువ్వుల ఆకారంలో వైట్, పింక్ రాళ్లతో తయారు చేసిన ఈ లాంగ్ చెవిపోగులు ఎంతో క్లాసీగా ఉంటాయి. సంప్రదాయ దుస్తులలో ఇది ఒక రాయల్ ఛాయిస్.

వింటేజ్ ఫ్లోరల్ డ్రాప్స్

పైన ముచ్చటైన పింక్ రిబ్బన్ బౌ డిజైన్, కింద రంగుల జుమ్కాలు ఉండటం వల్ల ఇది ఈతరం అమ్మాయిల మనసు దోచే ఇండో-వెస్ట్రన్ మోడల్ గా నిలుస్తుంది.

మోడర్న్ బౌ జుమ్కీలు 

లైట్ వెయిట్ గోల్డ్ ఫ్రేమ్ పై పింక్ క్రిస్టల్స్ మరియు ముత్యాల కలయికతో ఉన్న ఈ చెవిపోగులు సింపుల్ పార్టీ వేర్ మరియు ఫెస్టివ్ వేర్ కి చాలా బెస్ట్ ఆప్షన్.

గ్లాసీ పింక్ లూప్ ఇయర్ రింగ్స్