15th September 2026

_________

- Bhuvana

ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది..

ఇంట్లో అందం కోసం పెంచుకునే కొన్ని మొక్కలు ఆరోగ్యాకి, పెంపుడు జంతువులకు ఎంతటి హాని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!

రంగురంగుల ఆకులతో ఆకట్టుకునే కలాడియం మొక్కల ఆకులు తింటే నోరు వాచిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

కలాడియం

దీని ఆకులు నమిలితే గొంతు బిగుసుకుపోయి మాట పడిపోతుంది. అందుకే పెంపుడు జంతువులు, పిల్లలకు ఇది చాలా ప్రమాదకరం.

డంబ్ కేన్

ఇది చూడటానికి ముద్దుగా ఉన్నా, దీని ఆకులు లేదా బెర్రీలు తింటే కడుపునొప్పి, వాంతులు మరియు చర్మ సమస్యలు వస్తాయి.

ఇంగ్లీష్ ఐవీ

లిల్లీ మొక్కల రేకులు లేదా పుప్పొడి పిల్లులకు మరియు కుక్కలకు అత్యంత విషపూరితం. ఇది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.

లిల్లీ పువ్వులు

ఈ పామ్ జాతి మొక్కల్లోని గింజలు మరియు ఆకులు పెంపుడు జంతువులకు విపరీతమైన కాలేయ నష్టాన్ని, ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి.

సాగో పామ్ 

ఇది గాలిని శుద్ధి చేసినప్పటికీ, దీనిలోని కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు పెంపుడు జంతువుల నోటిలో మంట, వాపును సృష్టిస్తాయి.

పీస్ లిల్లీ

ఇళ్లలో ఎక్కువగా పెంచే ఈ తీగ మొక్కల్లో ఉండే విష పదార్థాల వల్ల నోరు ఎండిపోవడం, పెదాల వాపు వంటివి వస్తాయి.

ఫిలోడెండ్రాన్ 

ప్రతి ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ ఆకులు పిల్లులు లేదా కుక్కలు పొరపాటున నమిలితే తీవ్రమైన లాలాజలం కారడం జరుగుతుంది.

పోథోస్ / మనీ ప్లాంట్

గన్నేరు (Oleander), అలోకేసియా మొక్కలు గుండె సంబంధిత సమస్యలు మరియు తీవ్రమైన టాక్సిన్లను కలిగి ఉంటాయి కాబట్టి జాగ్రత్త!

ఒలియాండర్ & అలోకేసియా