నిటారుగా నిలబడటం, వెన్నుపూస సరిగ్గా ఉంచడం వల్ల శరీరంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది.
పోస్చర్ మార్చండి
ఇతరులతో మాట్లాడేటప్పుడు నేరుగా కళ్లలోకి చూస్తూ మాట్లాడటం వల్ల మీపై నమ్మకం పెరిగి గౌరవం లభిస్తుంది.
ఐ కాంటాక్ట్
"నేను చేయగలను" అని ప్రతిరోజూ మీకు మీరు చెప్పుకోండి. ప్రతికూల ఆలోచనలను పక్కన పెడితే సగం విజయం సాధించినట్లే!
పాజిటివ్ సెల్ఫ్-టాక్
ప్రతిరోజూ పూర్తి చేయగల చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోండి. అవి పూర్తయ్యాక వచ్చే తృప్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
చిన్న లక్ష్యాలు
రోజూ ఏదో ఒక క్రొత్త విషయం నేర్చుకోండి. జ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల ఏ సందర్భంలోనైనా ధైర్యంగా మాట్లాడగలరు.
కొత్త నైపుణ్యాలు
మీకు సరిపడే, కంఫర్టబుల్ దుస్తులను ధరించండి. మంచి డ్రెస్సింగ్ స్టైల్ మీ ఆత్మవిశ్వాసాన్ని తక్షణమే ఎలివేట్ చేస్తుంది.
డ్రెస్సింగ్ సెన్స్
మీ దగ్గర ఉన్న మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండండి. ఇది ఆందోళనను తగ్గించి మనశ్శాంతిని ఇస్తుంది.
కృతజ్ఞత కలిగి ఉండటం
ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి! ఈ యూజ్‌ఫుల్ టిప్స్‌ను ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.