మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్రమత్తు, బద్ధకం ముంచెత్తుతున్నాయా? ఈ చిన్న ఆహార నియమాలతో రోజంతా యాక్టివ్‌గా మెరిసిపోండి!
మధ్యాహ్న భోజనంలో రైస్, మైదా లాంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ఇవి బ్లడ్ షుగర్‌ను పెంచి బద్ధకానికి కారణమవుతాయి.
హెవీ కార్బ్స్ వద్దండి
పప్పు ధాన్యాలు, పనీర్, గుడ్లు లేదా చికెన్ వంటి ప్రోటీన్ ఆహారం తీసుకోండి. ఇది రోజంతా నిలకడైన శక్తిని ఇస్తుంది.
ప్రోటీన్ మస్ట్
భోజనంతో పాటు కీరా, క్యారెట్, ఆకుకూరల సలాడ్ తినండి. ఫైబర్ వల్ల జీర్ణక్రియ సులువై, నిద్రమత్తు దరిచేరదు.
పీచు పదార్థాలు
తెల్ల అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు, బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ ఎంచుకోండి. ఇవి నెమ్మదిగా కరిగి ఎక్కువ సమయం ఎనర్జీని ఇస్తాయి.
కాంప్లెక్స్ కార్బ్స్
భోజనం చివరలో మజ్జిగ తాగడం లేదా పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగై పొట్ట తేలికగా, హాయిగా ఉంటుంది.
మజ్జిగ / పెరుగు
పొట్ట నిండా అతిగా తినకుండా 80% మాత్రమే తింటే శరీరంపై భారం తగ్గుతుంది, తద్వారా నిద్రమత్తు రాకుండా ఉంటుంది.
పరిమితిగా తినండి