11th September2026

_________

- Bhuvana

బరువు తగ్గాలనుకునేవారు వాకింగ్ తర్వాత ఏం తినాలి?

వాకింగ్ ముగిశాక ముందుగా నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగండి. ఇవి చెమట వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తాయి.

రీహైడ్రేషన్ 

వాకింగ్ తర్వాత ప్రోటీన్ తింటే కండరాలు దృఢపడి కలోరీలు వేగంగా కరుగుతాయి. గుడ్లు, పనీర్ లేదా స్ప్రౌట్స్ ఎంచుకోండి.

ప్రోటీన్ అవసరం

రెండు ఉడకబెట్టిన గుడ్ల తెల్లసొన తినడం వల్ల శరీరానికి మంచి ప్రోటీన్ లభించి, ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.

ఉడకబెట్టిన గుడ్లు

మొలకెత్తిన పెసలు, శనగలలో పీచు పదార్థం ఎక్కువ. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, ఫ్యాట్ కరగడానికి తోడ్పడతాయి.

మొలకెత్తిన విత్తనాలు

గ్రీక్ యోగర్ట్‌లో ప్రొబయోటిక్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడి బరువును నియంత్రిస్తుంది.

గ్రీక్ యోగర్ట్ & బెర్రీస్

కొద్దిగా ఓట్స్, బాదం పప్పులు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ లభిస్తాయి.

ఓట్స్ & బాదం 

యాంటీఆక్సిడెంట్స్ ఉండే గ్రీన్ టీ లేదా నానబెట్టిన సబ్జా గింజల నీళ్లు తాగితే మెటబాలిజం రేటు వేగవంతమవుతుంది.

గ్రీన్ టీ / సబ్జా నీళ్లు