మనసును హత్తుకునే అందమైన హార్ట్ షేప్ గోల్డ్ పెండెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఈ ట్రెండీ డిజైన్స్ మీకోసం.
ఎలాంటి దుస్తులకైనా సరిపోయేలా ఉండే ఈ చిన్న హార్ట్ పెండెంట్ నిత్యం ధరించడానికి అద్భుతంగా ఉంటుంది.
సింపుల్ సోబర్
రెండు హార్ట్స్ ఒకదానితో ఒకటి కలిసి ఉన్న ఈ డిజైన్ ప్రేమకు, అనుబంధానికి చక్కటి ప్రతీకగా నిలుస్తుంది.
డబుల్ హార్ట్
బంగారంతో పాటు చుట్టూ మెరిసే డైమండ్స్ లేదా క్యూబిక్ జిర్కోనియా పొదిగిన హార్ట్ పెండెంట్ రాయల్ లుక్ ఇస్తుంది.
స్టోన్ స్టార్డెడ్
తాళం చెవి మరియు హార్ట్ కాంబినేషన్ లో వచ్చే ఈ మోడ్రన్ పెండెంట్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కీ అండ్ హార్ట్
సాధారణ పసుపు బంగారానికి బదులుగా రోజ్ గోల్డ్‌తో తయారైన హార్ట్ పెండెంట్స్ చాలా ట్రెండ్‌గా ఉన్నాయి.
రోజ్ గోల్డ్ టచ్
ఇన్ఫినిటీ గుర్తుతో హార్ట్ షేప్ కలిసి ఉండే ఈ డిజైన్ చాలా యూనిక్‌గా, ఎప్పటికీ ఫ్యాషన్‌లో ఉండేలా ఉంటుంది.
ఇన్ఫినిటీ హార్ట్
హార్ట్ షేప్ చుట్టూ సున్నితమైన పూల డిజైన్స్ చెక్కిన ఈ పెండెంట్ ట్రెడిషనల్ లుక్ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్.
ఫ్లోరల్ హార్ట్
మీకు ఇష్టమైన వారి పేర్లు లేదా మొదటి అక్షరం హార్ట్ మధ్యలో వచ్చేలా డిజైన్ చేయించుకోవచ్చు.
నేమ్ కస్టమైజ్డ్
మీ ప్రియమైన వారికి ప్రత్యేక సందర్భాలలో బహుమతిగా ఇవ్వడానికి ఈ హార్ట్ షేప్ పెండెంట్స్ చక్కటి ఎంపిక.
పర్ఫెక్ట్ గిఫ్ట్