చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుందా? దీని వెనుక అనేక జీవనశైలి, ఆరోగ్య సంబంధిత కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
మీ తల్లిదండ్రులకు లేదా కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తే, జన్యువుల కారణంగా మీకు కూడా రావచ్చు.
జన్యుపరమైన కారణాలు
శరీరంలో విటమిన్ బి12, డి, ఐరన్ మరియు కాపర్ లోపించడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లబడుతుంది.
పోషకాహార లోపం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి పెరగడం వల్ల కణాలు దెబ్బతిని అకాల నెరుపు సమస్య వస్తుంది.
అధిక ఒత్తిడి
థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరంలో పిగ్మెంటేషన్ తగ్గి జుట్టు త్వరగా తెల్లగా మారుతుంది.
థైరాయిడ్ సమస్యలు
ధూమపానం చేసేవారిలో సిగరెట్లోని హానికారక రసాయనాలు జుట్టు కుదుళ్లను దెబ్బతీసి అకాల నెరుపుకు దారితీస్తాయి.
ధూమపానం అలవాటు
జుట్టుకు వాడే షాంపూలు, డైలలో ఉండే హానికారక కెమికల్స్ కుదుళ్లపై ప్రభావం చూపి జుట్టు రంగును మారుస్తాయి.
రసాయన ఉత్పత్తులు
శరీరంలో వచ్చే హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే అవకాశం ఉంది.
హార్మోన్ల మార్పులు
కొన్ని రకాల వ్యాధుల వల్ల శరీర రోగ నిరోధక శక్తి సొంత కణాలపైనే దాడి చేసి మెలనిన్ ఉత్పత్తిని నాశనం చేస్తుంది.
ఆటో ఇమ్యూన్ వ్యాధులు
పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం మరియు మంచి జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు.
నివారణ మార్గాలు