ఉదయం పూట శక్తి లేనట్లు, నీరసంగా అనిపిస్తుందా? రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి!
పెసలు, శనగలు వంటి మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే ఉదయాన్నే తక్షణ శక్తి లభిస్తుంది.
మొలకెత్తిన గింజలు
ఓట్స్, అరటిపండు, పాలు కలిపి చేసుకున్న స్మూతీ ఒక గ్లాస్ తాగితే రోజంతా నీరసం రాకుండా యాక్టివ్‌గా ఉండవచ్చు.
అరటిపండు, ఓట్స్ స్మూతీ
ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు అంది, కండరాలు బలపడి శక్తి నిలకడగా ఉంటుంది.
గుడ్డుతో కూడిన బ్రేక్‌ఫాస్ట్
గోధుమ బ్రెడ్‌పై పీనట్ బటర్ రాసుకుని తింటే మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అంది అలసట ఇటు వైపు కూడా రాదు.
పీనట్ బటర్ టోస్ట్
ఆవిరిపై ఉడికించిన ఇడ్లీ తేలికగా జీర్ణమవుతుంది. ఇది కడుపును బరువెక్కిచకుండా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
పోషకాల నిధి ఇడ్లీ
రాగులతో చేసిన దోశలో క్యాల్షియం, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇది నీరసాన్ని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రాజా రాగి దోశ
పాలలో ఓట్స్ ఉడికించి అందులో బాదం, కిస్మిస్ వేసుకుని తింటే పోషకాలు నిండిన శక్తివంతమైన అల్పాహారం సిద్ధం.
డ్రై ఫ్రూట్స్ ఓట్ మీల్
యాపిల్, దానిమ్మ, బొప్పాయి వంటి తాజా పండ్లతో చేసిన సలాడ్ తింటే విటమిన్లు అంది శరీరం ఉల్లాసంగా మారుతుంది.
పండ్ల సలాడ్
పనీర్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో పనీర్ చేర్చుకోవడం వల్ల నీరసం మాయమై ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
పనీర్ బుర్జీ లేదా శాండ్విచ్