అధికంగా నీరు పోయడం వల్ల నేలలో గాలి తగ్గి వేర్లు దెబ్బతినవచ్చు. మట్టి తడిగా ఉన్నప్పుడే మళ్లీ నీరు పోయకండి.
నీరు ఎక్కువగా పోస్తున్నారా?
ఎక్కువ రోజులు నీరు అందకపోయినా ఆకులు పసుపెక్కి, వాడిపోయి రాలిపోవచ్చు. నీరు పెట్టే ముందు మట్టి తేమను పరిశీలించండి.
నీరు తక్కువైనా సమస్యే
చాలా తక్కువ లేదా ఎక్కువ వెలుతురు రెండూ ఆకుల రంగును ప్రభావితం చేయవచ్చు. మొక్కకు అవసరమైన వెలుతురు అందే ప్రదేశాన్ని ఎంచుకోండి.
సరైన వెలుతురు అందుతోందా?
ముఖ్యంగా నైట్రోజన్ వంటి పోషకాల లోపం పాత ఆకులు పసుపు రంగులోకి మారడానికి కారణం కావచ్చు. అవసరాన్ని బట్టి ఎరువు వాడండి.
పోషకాల లోపం ఉండొచ్చు
నీరు నిలిచిపోయే నేల లేదా డ్రైనేజీ సమస్యలతో వేర్లు కుళ్లిపోతే ఆకులు పసుపెక్కవచ్చు. కుండలో డ్రైనేజ్ రంధ్రాలు ఉండేలా చూడండి.
వేర్ల పరిస్థితి చెక్ చేయండి
అఫిడ్స్, స్పైడర్ మైట్స్ వంటి పురుగులు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వెలిసిపోయి పసుపెక్కవచ్చు. ఆకుల కింది భాగాన్ని కూడా పరిశీలించండి.
పురుగులు దాడి చేశాయా?
చల్లని గాలి, వేడి గాలి లేదా ఒక్కసారిగా వెలుతురు, ఉష్ణోగ్రత మారడం మొక్కపై ఒత్తిడిని పెంచి ఆకులు పసుపెక్కేలా చేయవచ్చు.
ఉష్ణోగ్రత మార్పులు కూడా కారణమే
ఒక్కోసారి కింది భాగంలోని పాత ఆకులు మాత్రమే పసుపెక్కి రాలిపోవడం సహజ ప్రక్రియ. కొత్త ఆకులు ఆరోగ్యంగా ఉంటే ఆందోళన అవసరం లేదు.
పాత ఆకులు పసుపెక్కడం సహజమే