పిల్లలు తమ ఆనందాలు, భయాలు, సమస్యలు ముందుగా మీతోనే పంచుకోవాలంటే ఇంట్లో ప్రేమ, నమ్మకం, స్వేచ్ఛతో కూడిన బంధం అవసరం.
పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా శ్రద్ధగా వినండి. వారి మాటలకు స్పందిస్తే, తమ భావాలను మీతో పంచుకోవడానికి మరింత సౌకర్యంగా భావిస్తారు.
ముందుగా వినడం నేర్చుకోండి
పిల్లలు ఏడ్చినా, కోపంగా ఉన్నా వెంటనే మందలించకండి. ముందుగా వారి భావాన్ని అర్థం చేసుకుని, ప్రశాంతంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి.
భావాలను చిన్నచూపు చూడకండి
రోజులో కొంతసేపైనా ఫోన్, టీవీ పక్కన పెట్టి పిల్లలతో మాట్లాడండి లేదా ఆడండి. కలిసి గడిపే చిన్న సమయమే బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది.
రోజూ కొంత క్వాలిటీ టైమ్
పిల్లలకు నచ్చే ఆటలు, కథలు, పాటలు లేదా విషయాల గురించి అడగండి. వారి ఆసక్తుల్లో మీరు భాగమైతే మీతో మాట్లాడటానికి వారికి మరింత ఆసక్తి పెరుగుతుంది.
వాళ్ల ఆసక్తులను తెలుసుకోండి
“నువ్వు చెడ్డవాడివి” అనకుండా “ఈ పని సరైంది కాదు” అని చెప్పండి. ఇలా చేస్తే తప్పును అర్థం చేసుకుంటారు కానీ తమను తాము తక్కువగా భావించరు.
తప్పులపై వ్యక్తిని కాదు, ప్రవర్తనను చెప్పండి
పిల్లలు మంచి పని చేసినప్పుడు వెంటనే గుర్తించి ప్రశంసించండి. వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మంచి ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది.
ప్రశంసించడంలో వెనుకాడకండి
పేరెంటింగ్ అంటే ఎప్పుడూ నియమాలు చెప్పడం కాదు. పిల్లలతో నవ్వుతూ మాట్లాడటం, ఆడటం, సరదాగా గడపడం మీ మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది.
కలిసి సరదాగా గడపండి
పిల్లలు మీరు చెప్పే మాటలకంటే మీ ప్రవర్తనను కూడా గమనిస్తారు. మీరు ప్రశాంతంగా మాట్లాడటం, గౌరవించడం, మాట నిలబెట్టుకోవడం వారికి నేర్పుతుంది.
ఫ్రెండ్‌లా ఉండండి