జిడ్డు చర్మం వల్ల ముఖం నూనెగా మారుతుందా? ఈ 7 సింపుల్ చిట్కాలతో ముఖంపై జిడ్డును సులభంగా తగ్గించుకోండి!
ముఖాన్ని రోజుకు కనీసం రెండుసార్లు జెంటిల్ ఫేస్‌వాష్‌తో కడగడం వల్ల అదనపు నూనె మరియు మురికి తొలగిపోతాయి.
రోజూ రెండుసార్లు క్లెన్సింగ్
ముఖంపై ఐస్ క్యూబ్‌తో కొన్ని నిమిషాలు మసాజ్ చేస్తే, చర్మ రంధ్రాలు కుచించుకుపోయి నూనె ఉత్పత్తి తగ్గుతుంది.
ఐస్ క్యూబ్స్ మసాజ్
ముల్తానా మట్టి చర్మంలోని అదనపు జిడ్డును పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి రెండుసార్లు ఇది వాడండి.
ముల్తానా మట్టి ఫేస్‌ప్యాక్
చాలా మంది జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ రాయరు. కానీ ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్ రాయడం చాలా అవసరం.
హైడ్రేషన్ చాలా ముఖ్యం
రోజ్ వాటర్ లేదా నేచురల్ టోనర్ ఉపయోగించడం వల్ల చర్మం సమతుల్యంగా ఉండి, జిడ్డుదనం క్రమంగా తగ్గుతుంది.
టోనర్ వాడకం
రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయి చర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది.
నీళ్లు ఎక్కువగా తాగండి
నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చర్మంపై జిడ్డు సమస్య తగ్గుతుంది.
ఆయిల్ ఫుడ్‌కు దూరం
ముఖం తరచూ చేతులతో తాకడం మానుకోండి. అలాగే రాత్రి పడుకునే ముందు మేకప్‌ను తప్పకుండా తొలగించాలి.
అదనపు చిట్కా
ఈ చిన్న చిన్న చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ముఖంపై జిడ్డు మాయమై, మీ చర్మం కాంతివంతంగా మారుతుంది!
మెరిసే చర్మం మీ సొంతం