2026లో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ హాలీవుడ్ సినిమాలు హారర్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు... ఈ ఏడాదిలో ఇప్పటిదాగా ఊహించిన దానికంటే పెద్ద సినిమా విందునే ఇచ్చాయి. హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్.. ఇలా అన్ని రకాల సినిమాలు వచ్చాయి. ఇదిగో ఇప్పటివరకు వచ్చిన టాప్ 10.
సినిమా తీయడం గురించి ఒక సినిమా! ఫ్రెంచ్ న్యూ వేవ్ దర్శకుడు జీన్-లూక్ గోడార్డ్ తన తొలి చిత్రం Breathlessను ఎలా తెరకెక్కించాడనే కథతో ఈ సినిమా సాగుతుంది. సినిమా ప్రేమికులకు ఇది ఒక ప్రత్యేకమైన ట్రీట్.
Nouvelle Vague
స్టీవెన్ సోడర్బర్గ్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఆర్ట్ హీస్ట్ నేపథ్యంగా సాగినా.. అసలు బలం కథలోని పాత్రలు, వాటి మధ్య జరిగే పదునైన సంభాషణల్లో ఉంటుంది. సర్ ఇయాన్ మెక్‌కెల్లెన్ నటన ఈ సినిమాకు మరో హైలైట్.
The Christophers
ఇది కాస్త విచిత్రమైన సినిమా. 2008లో తీసిన ఫుటేజ్‌ను ప్రస్తుత కాలపు సన్నివేశాలతో కలిపి ఒక ప్రత్యేకమైన కథను తయారు చేశారు. ఎడిటింగ్, కామెడీ, అబ్సర్డ్ సిట్యుయేషన్స్ కలిసి సినిమాకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి.
Nirvanna The Band The Show The Movie
తప్పిపోయిన కూతురి కోసం వెతుకుతున్న తండ్రి. మొరాకో ఎడారిలో మొదలయ్యే ఈ ప్రయాణం క్రమంగా ఒక మానసిక ప్రయాణంగా మారుతుంది. ఇది కేవలం రోడ్ మూవీ కాదు. దుఃఖం, నష్టం, మనిషి లోపల జరిగే సంఘర్షణ గురించి చెప్పే సినిమా.
Sirāt
జోంబీ సినిమా అంటే కేవలం భయపెట్టడమే కాదు. ఈ సీక్వెల్లో మనిషి చుట్టూ ఉన్న విపత్తు అతని ఆలోచనలను ఎలా మార్చేస్తుందో చూపించారు. హింస, భయం, మానసిక సంఘర్షణలతో సాగే ఈ సినిమా చివరి వరకు వెంటాడుతుంది.
28 Years Later: The Bone Temple
1977లోని బ్రెజిల్ నియంతృత్వ కాలం. ఆ సమయంలో ఒక వ్యక్తి ఎదుర్కొనే భయం, రాజకీయ హింస, గత జ్ఞాపకాలను కలిపి తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ఇది. చరిత్రను కేవలం చెప్పకుండా.. ఒక మనిషి జీవితంలోకి తీసుకెళ్లడం ఈ సినిమా ప్రత్యేకత.
The Secret Agent
రెండు జంటలు. ఒక సమావేశం. బయటకు కనిపించని ఎన్నో సమస్యలు. ఒలివియా వైల్డ్ తెరకెక్కించిన ఈ కామెడీ సంబంధాల్లో దాగి ఉండే అసహనం, అసూయ, అసంతృప్తిని చాలా సహజంగా చూపిస్తుంది. నవ్విస్తూనే మన సంబంధాల గురించి ఆలోచింపజేస్తుంది.
The Invite
2026లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ హారర్ సినిమాల్లో ఇదొకటి. తన ప్రేమికురాలు తనను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుకునే యువకుడి కథ ఇది. కానీ ప్రేమ ఎప్పుడు స్వాధీన భావంగా మారుతుంది? అక్కడి నుంచే అసలు భయం మొదలవుతుంది.
Obsession
ఒక మనిషి.. ఒక గ్రహాంతరవాసి.. ప్రపంచాన్ని కాపాడాల్సిన మిషన్. రయాన్ గోస్లింగ్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా స్పేస్ అడ్వెంచర్‌తో పాటు కామెడీ, ఎమోషన్‌ను కూడా కలిపింది. రయ్లాండ్ గ్రేస్, రోకీ మధ్య ఏర్పడే స్నేహం సినిమాకు అసలు హృదయం.
Project Hail Mary
ఈ జాబితాలో నంబర్ వన్ మాత్రం మామూలు సినిమా కాదు. క్రిస్టోఫర్ నోలన్.. హోమర్ రాసిన వేల సంవత్సరాల నాటి Odysseyని భారీ IMAX ప్రపంచంగా తెరపైకి తీసుకొచ్చారు. ట్రోజన్ యుద్ధం తర్వాత ఇంటికి తిరిగి వెళ్లే ఒడిస్సియస్ ప్రయాణం.. సముద్రాలు, యుద్ధాలు, దేవతలు, ప్రమాదాలతో సాగుతుంది.
The Odyssey
ఈ సినిమా రీసెంట్ గానే రిలీజైంది. ఇంకా కలెక్షన్స్ వర్షం కురుస్తూనే ఉంది. నోలన్ సినిమాని దాటుతుందా లేదా అని తేలాల్సి ఉంది.
ఎందుకు స్పైడర్ మ్యాన్ ని కలపలేదు?