11th Aug 2026

_________

- Bhuvana

ప్రోటీన్‌తో నిండిన ఈ టిఫిన్స్.. బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఛాయిస్!

ఉదయాన్నే పరగడుపున బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండాలంటే ప్రొటీన్ ఉన్న టిఫిన్ చాలా ముఖ్యం. మన ఆకలిని తగ్గిస్తూ రోజంతా ఉత్సాహాన్ని ఇచ్చే బ్రేక్‌ఫాస్ట్ చూద్దాం!

పెసరపప్పులో ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఉదయాన్నే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరగవు.

పెసరట్టు

శనగపిండికి క్యారెట్, తోటకూర కలిపి చేసే చిల్లా ప్రొటీన్‌తో నిండి ఉంటుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.

శనగపిండి చిల్లా

పనీర్‌లో ఉండే హై-క్వాలిటీ ప్రొటీన్, క్యాల్షియం గ్లూకోజ్ శోషణను మందగింపజేస్తాయి. కొద్దిగా కూరగాయలు చేర్చి తింటే షుగర్ కంట్రోల్ చాలా సులభం.

పనీర్ బుర్జీ

మొలకెత్తిన పెసలు, శనగల్లో ప్రొటీన్ మరియు కాంప్లెక్స్ ఫైబర్ దండిగా ఉంటాయి. కొద్దిగా నిమ్మరసం, ఉల్లిపాయలు కలిపి తింటే షుగర్ స్పైక్స్ అసలు రావు.

మొలకెత్తిన గింజల చాట్

రోల్డ్ ఓట్స్, పనీర్ మరియు తరిగిన కూరగాయలతో చేసుకునే టిక్కీలు ప్రొటీన్, బీటా-గ్లూకన్ ఫైబర్‌ను అందించి షుగర్ స్పైక్స్ రాకుండా నిరోధిస్తాయి.

ఓట్స్ పనీర్ టిక్కీ

ఉడకబెట్టిన రాజ్మా లేదా శనగలకు తాలింపు వేసి సుండల్‌లా తింటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ లభించి రోజంతా శక్తిగా ఉంటుంది.

 రాజ్మా సుండల్

 సాధారణ బియ్యం దోసెకు బదులు రాగులు లేదా జొన్నలతో చేసిన దోసెలు బెస్ట్. వీటిలోని ఫైబర్, ప్రొటీన్ కాంబినేషన్ రక్తంలో షుగర్ పెరగకుండా అదుపుచేస్తుంది.

జొన్న/రాగి దోస 

గడ్డ పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి అవిసె గింజలు లేదా చియా సీడ్స్ కలిపి తింటే ఉదయాన్నే బ్లడ్ షుగర్ పెరగకుండా అద్భుతంగా పనిచేస్తుంది.

చియా విత్తనాలతో గడ్డ పెరుగు

టిఫిన్‌లో కార్బోహైడ్రేట్లను తగ్గించి, ప్రొటీన్ మరియు ఫైబర్ ఉండేలా చూసుకోండి. సరైన బ్రేక్‌ఫాస్ట్‌తో డయాబెటిస్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు!