వర్షాకాలంలో పాదాలు బురద నీటిలో తడిసి ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. కాబట్టి ఈ సీజన్లో పాదాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో పాదాల జాగ్రత్త..
బయట తిరిగి రాగానే గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రంగా కడగాలి. వేళ్ల మధ్యలో కూడా తడి లేకుండా పొడి పొడిగా తుడిచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోండి.
పాదాలను శుభ్రంగా ఉంచుకోండి..
వర్షంలో పాదాలు తడిస్తే వెంటనే బూట్లు, సాక్సులు మార్చాలి. పాదాలు ఎక్కువసేపు తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎప్పుడూ పొడిగా ఉంచండి..
వర్షాకాలంలో మూసుకు ఉండే బూట్లకు బదులుగా వాటర్‌ప్రూఫ్ చెప్పులు లేదా శాండిల్స్ వాడండి. ఇవి త్వరగా ఆరిపోతాయి, పాదాలకు గాలి తగిలేలా చూస్తాయి.
సరైన పాదరక్షలు ధరించండి..
పాదాలకు, ముఖ్యంగా వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్‌ను రాయండి. ఇది చెమటను పీల్చుకుని, దురద మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
యాంటీ ఫంగల్ పౌడర్ వాడకం..
శుభ్రం చేసుకున్న తర్వాత పాదాలకు మంచి మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ రాయండి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి, పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోకండి..
వర్షాకాలంలో గోళ్లలో బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కత్తిరించుకోవడం వల్ల మురికి చేరకుండా, ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి.
గోళ్లను ఎప్పుడూ చిన్నగా ఉంచండి..
వారానికి ఒకసారి సున్నితమైన స్ర్కబ్బర్‌తో పాదాలపై ఉండే మృతకణాలను తొలగించండి. ఇది పాదాల చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
వారానికి ఒకసారి స్ర్కబ్ చేయండి..
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, పాదాలను 10 నిమిషాలు ఉంచండి. ఇది అలసటను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
గోరువెచ్చని నీటితో సోకింగ్..
ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలోనూ మీ పాదాలు అందంగా, ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంటాయి!
ఆరోగ్యకరమైన పాదాలు మీ సొంతం..