5th August 2026

_________

- Saidulu

అతిథులు వచ్చినప్పుడు వెంటనే తయారు చేయగలిగే స్నాక్స్

అనుకోకుండా అతిథులు వచ్చారా? ఆందోళన వద్దు. కేవలం నిమిషాల్లో ఎంతో రుచికరంగా, త్వరగా తయారు చేయగలిగే అద్భుతమైన స్నాక్స్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.

బ్రెడ్ ముక్కలను చిన్నగా కట్ చేసి ఉల్లిపాయ, టమాటాలతో పాన్ పై వేయించండి. చిటికెలో తయారయ్యే ఈ కరకరలాడే స్నాక్ అందరికీ నచ్చుతుంది.

బ్రెడ్ మసాలా టోస్ట్

ఉడికించిన స్వీట్ కార్న్‌లో ఉప్పు, కారం, నిమ్మరసం, చాట్ మసాలా కలపండి. వేడి వేడిగా ఉండే ఈ టేస్టీ చాట్ అతిథులకు వెంటనే సర్వ్ చేయవచ్చు.

మసాలా కార్న్ చాట్

అటుకులను నూనెలో వేయించి, పల్లీలు, కరివేపాకు, తాలింపు గింజలు కలపండి. రుచికరమైన ఈ స్నాక్ టీతో పాటు ఇవ్వడానికి పర్ఫెక్ట్ ఛాయిస్.

ఇన్‌స్టెంట్ పోహా మిక్స్చర్

బ్రెడ్ స్లైసెస్ పై వెన్న, వెల్లుల్లి పేస్ట్, చీజ్ వేసి ఓవెన్లో లేదా పాన్ పై కాల్చండి. చీజీగా ఉండే ఈ ఐటమ్ పిల్లలకి కూడా చాలా ఇష్టం.

చీజ్ గార్లిక్ బ్రెడ్ 

తురిమిన పనీర్‌ను ఉల్లిపాయ పచ్చిమిర్చితో వేయించి బ్రెడ్‌పై పెట్టండి. ప్రొటీన్లతో కూడిన ఈ హెల్దీ స్నాక్ నిమిషాల్లో రెడీ అవుతుంది.

పనీర్ బుర్జీ టోస్ట్

రెండు బ్రెడ్ స్లైసెస్ మధ్య పుదీనా చట్నీ, దోసకాయ ముక్కలు పెట్టండి. చల్ల చల్లని ఈ రిఫ్రెషింగ్ శాండ్‌విచ్ ఎంతో రుచిగా ఉంటుంది.

పుదీనా ఛట్నీ శాండ్‌విచ్

తామర గింజలను నెయ్యిలో వేయించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లండి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ తేలికపాటి స్నాక్ భలే రుచిగా ఉంటుంది.

మసాలా మఖానా

అరటికాయ ముక్కలను శనగపిండి మిశ్రగంలో ముంచి నూనెలో వేయించండి. వర్షాకాలంలో లేదా సాయంత్రం వేళల్లో ఈ వేడి బజ్జీలు అద్భుతంగా ఉంటాయి.

అరటికాయ బజ్జీలు

ఈ సులభమైన స్నాక్స్‌తో అతిథులకు రుచికరమైన ఆతిథ్యం ఇవ్వండి. తక్కువ సమయంలోనే వారి మనసు గెలుచుకోండి!