31st July 2026

_________

- Saidulu

జిడ్డు లేకుండా, నిమిషాల్లో కరకరలాడే బెండకాయ ఫ్రై చేసే విధానం!

జిడ్డుగా ఉంటుందని బెండకాయ ఫ్రై తినడం మానేస్తున్నారా? అయితే నిమిషాల్లో జిడ్డు వదిలేలా కరకరలాడే రెసిపీ మీకోసం!

లేత బెండకాయలను ఎంచుకుని, శుభ్రంగా కడగాలి. జిడ్డు పోవడానికి ఇవి పూర్తిగా పొడిగా మారడం చాలా ముఖ్యం.

మొదటి మెుట్టు

కడిగిన కాయలను పొడవుగా లేదా చక్రాలలా కోయాలి. ముక్కలు తడి లేకుండా చూసుకోవడం జిడ్డు రాకుండా చేస్తుంది.

కట్ చేసే విధానం

కోసిన బెండకాయ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసం పిండాలి. ఇది జిడ్డుదనాన్ని పూర్తిగా తొలగిస్తుంది.

నిమ్మరసం రహస్యం

ముక్కలకు కొద్దిగా శనగపిండి లేదా బియ్యం పిండి పట్టించాలి. ఇది నూనెలో వేగాక అద్భుతమైన క్రిస్పీ టెక్చర్ ఇస్తుంది.

క్రిస్పీ కోటింగ్

బాణీలో కొద్దిగా నూనె వేసి వేడిశాక, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి.

తాలింపు ప్రాసెస్

సిద్ధం చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి మంటను మీడియంలో ఉంచి వేయించాలి. మూత పెట్టకూడదు.

ఫ్రై చేసే విధానం

ముక్కలు దోరగా వేగాక చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి మరియు తగినంత ఉప్పు కలపాలి.

మసాలాలు

మరో రెండు నిమిషాలు సన్నని మంటపై కలుపుతూ వేయిస్తే, గుమగుమలాడే కరకరలాడే బెండకాయ ఫ్రై సిద్ధం.

కరకరలాడే వేపుడు

వేడివేడి అన్నంతో లేదా సాంబార్‌తో ఈ క్రిస్పీ బెండకాయ ఫ్రై తింటే రుచి అదిరిపోతుంది. ఇప్పుడే ట్రై చేయండి!